Nag Ashwin: పాన్ వరల్డ్ క్రేజ్ తో “ప్రాజెక్ట్ కె”..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ రిజల్ట్ ని ముందుగానే ఊహించిన ప్రభాస్ అభిమానులు ఆ సినిమా గురించి మర్చిపోయి ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ గురించి వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కమ్ బ్యాక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో నిన్న సలార్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టే తెలుస్తుంది. ఇక ఈ సందడిలోనే ప్రభాస్ “ప్రాజెక్ట్ కె” కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ప్రాజెక్ట్ కె” భారీ పాన్ ఇండియా చిత్రంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ నుండి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ప్రాజెక్ట్ కె సినిమా యూనిట్ ప్రపంచ ప్రఖ్యాత “కామిక్ కాన్ ఇంటర్నేషనల్” సంస్థ వారితో టై అప్ అయ్యారు. జులై 20న అమెరికాలో ఈ సంస్థ జరుపుతున్న ఈవెంట్ కి ప్రాజెక్ట్ కే చిత్ర యూనిట్ హాజరవ్వబోతున్నారు. టాలీవుడ్ హల్క్ దగ్గుపాటి రానా తన ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నట్టు సమాచారం. స్వతహాగా రానా ఒక VFX డెవలపర్ అని తెలిసిందే. తన VFX స్నేహితుల పరిచయాలతో రానానే కామిక్ కాన్ సంస్థతో ప్రాజెక్ట్ కే టీమ్ ని కలిపాడని సమాచారం.

ఇక ప్రాజెక్ట్ కే సినిమా టీజర్ ని కూడా అమెరికాలోనే ఈ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్ తో ప్రాజెక్ట్ కే పాన్ వరల్డ్ రేంజ్ లో అంచనాలని పెంచేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా 2024 సమ్మర్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు