Prabhas: నెవర్ బిఫోర్.. ఆల్ టైమ్ రికార్డు కొట్టేసిన “సలార్”

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “సలార్“. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా యొక్క అఫిషియల్ టీజర్ జులై6 న తెల్లవారుజామున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా టీజర్స్ గాని, గ్లిమ్ప్స్ గాని డే టైమ్ లో ఉదయం 10 నుండి సాయంత్రం ఏడు గంటల మధ్య రిలీజ్ చేస్తారు. కానీ సలార్ టీజర్ ని మాత్రం తెల్లవారు జామున 5.12 గంటలకి రిలీజ్ చేయడం జరిగింది. బహుశా అంత ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ ఇదే కావచ్చు.

అయితే సలార్ టీజర్ అనుకున్న అంచనాలని మించకపోయినా పరవాలేదనిపించింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన కే.జి.ఎఫ్ సినిమా మేకింగ్ స్టైల్ లోనే దీన్ని కూడా తెరకెక్కించడం జరిగింది. అందువల్ల సలార్ కే.జి.ఎఫ్ సినిమాకి కొనసాగింపుగా భావించవచ్చు. అయితే పొద్దున్నే టీజర్ రిలీజ్ కావడం వల్ల మార్నింగ్ నుండి వ్యూస్ భారీ లెవెల్లో వచ్చాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించగా 24 గంటలు ముగిసేసరికి సలార్ ఇండియన్ టీజర్ లలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.

24 గంటలు ముగిసేసరికి “సలార్” టీజర్ 83 మిలియన్ల వ్యూస్ సాధించి ఎపిక్ రికార్డును నమోదు చేసింది. ఇంతకు ముందు హైయెస్ట్ వ్యూస్ ఉన్న కె.జి.ఎఫ్2 టీజర్ ని ఆదిపురుష్ చిన్న మార్జిన్ తో బ్రేక్ చేయగా, ఇప్పుడు ఈ రెండింటిని భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది సలార్. అయితే లైక్స్ పరంగా కూడా భారీగానే వచ్చిన కొత్త రికార్డులు నమోదుకాలేదు. 24 గంటల్లో 1.6 మిలియన్ల లైక్స్ రాగా, 4.1 మిలియన్ల లైక్స్ తో కె.జి.ఎఫ్ టీజర్ ఇప్పటికి అగ్రస్థానంలో ఉంది. ఈ జోరును కంటిన్యూ చేస్తే రెండు మూడు రోజుల్లోనే సలార్ 100 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు