Taxiwala: స్టన్నింగ్ గ్లామర్ తో మతిపోగొడుతున్న ప్రియాంక

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనంతపూర్ లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి మరాఠీ ఫ్యామిలీకి చెందినది. అయినప్పటికీ తెలుగమ్మాయిగానే పాపులర్ అయింది. టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే గాక నటిగాను మంచి మార్కులు కొట్టేసింది. అయితే సినిమా హిట్టయినా ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు రాలేదు. పలు చిన్న సినిమాల్లోనే నటించింది.

టాక్సీవాలా తర్వాత వచ్చిన తిమ్మరుసు, ఎస్ ఆర్ కళ్యాణమండపం యావరేజ్ గా ఆడగా గమనం కూడా మెప్పించలేకపోయింది. దాంతో టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాలేదు. అలాగని వేరే ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళలేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం తెగ సందడి చేస్తుంది ఈ భామ. ఎప్పటికప్పడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ లు చేస్తూ, నెట్టింట వైరల్ అవుతుంది. అంతే కాక ఫోటో షూట్లు కూడా బాగా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్ యూత్ ని తెగ అట్ట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ జీన్స్ లో ఫోటోలు దిగిన ఈ భామ నలుపు అందాలతో ఆకర్షిస్తూ యువతకి మతి పోగొడుతుంది.

అయితే ప్రియాంక జవాల్కర్ తాజాగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈ పాత్ర ద్వారా కథలో కొన్ని మలుపులు తిరుగుతాయని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ చెప్పేవరకు ఆగాలి. ఇక సినిమాలో ప్రియాంక నటించి దాదాపు రెండేళ్లు కావస్తుంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు