Bollywood Hero Tiger Shroff : చాలా ఎక్కువైంది కత్తిరించు… స్టార్ హీరోకు నిర్మాతల మాస్ వార్నింగ్

RBollywood Hero Tiger Shroff : టాలీవుడ్‌లో సొంత కాళ్లతో పైకి వచ్చిన హీరోలు ఉంటారు. బ్యాగ్రౌండ్‌తో వచ్చినా, సక్సెస్ అవ్వడానికి నానా పాట్లు పడుతారు. కానీ, బాలీవుడ్‌లో అలా కాదు. బ్యాగ్రౌండ్‌తో వచ్చిన వాళ్లుకు కాస్త బలుపు ఉంటది అనే పేరు ఎప్పటి నుంచో ఉంది. అందుకే బాలీవుడ్‌లో బ్యాగ్రౌండ్ తో వచ్చిన నటీనటులను స్టార్ కిడ్స్ అంటూ ఎటకారంగా పిలుస్తారు.

బాలీవుడ్‌లో ఇప్పటి వరకు సక్సెస్ అందుకోలేని స్టార్ కిడ్స్ చాలా మంది ఉన్నారు. అందులో జాకీ ష్రాఫ్ కుమారుడు, కండల వీరుడు టైగర్ ష్రాఫ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం…

ఈ యంగ్ హీరో సినిమా చేశాడంటే… సిక్స్ ప్యాక్ కనిపించాల్సిందే. అంత ఎందుకు సోషల్ మీడియాలో ఓ పిక్ పెట్టాల్సి వచ్చినా, షర్ట్ విప్పి కండలు చూపించాల్సిందే. బాడీ పరంగా, ఫిట్ నెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండే ఈ టైగర్… కథలను ఎంచుకోవడంలో మాత్రం ఎప్పుడూ ఫెయిల్యూరే.

- Advertisement -

అందుకే “బాడీ బిల్డింగ్ పైన పెట్టిన శ్రద్దలో సగం సినిమాలపై పెడితే స్టార్ కిడ్ కాకుండా స్టార్ హీరో అయ్యేవాడు” అంటూ ట్రోల్స్ వస్తుంటాయి. ఇటీవల ఈ స్టార్ కిడ్ బడే మియాన్ చోటే మియాన్ అనే సినిమా చేశాడు. అక్షయ్ కుమార్‌తో కలిసి చేయడం కాబట్టి హిట్ ఖాయం అనుకున్నాడు. కానీ, ఈ మూవీ ఇద్దరికి పెద్దా… డిజాస్టర్ ను ఇచ్చింది.

Bade Miyan Chote Miyan
Bade Miyan Chote Miyan

దీని తర్వాత టైగర్ కు బాలీవుడ్ నిర్మాతలు షాక్ ఇచ్చారట. ఇప్పటి వరకు చేసింది చాలు. నిర్మాతలతో ఆడుకున్నది చాలు. ఇక హై రెమ్యునరేషన్ తీసుకోవడం మానేయ్ అని మొహం మీదే చెప్పేశారట. రెమ్యునరేషన్ తగ్గించడం అంటే.. కోటి – రెండు కోట్లు కాదు.. ఏకంగా 70 శాతం తగ్గించమని సలహా ఇచ్చారట. లేకపోతే కెరీర్ ముందుకు సాగడం కష్టమే అని తెల్చి చెప్పారట.

అంటే, ఇప్పుడు ఈ స్టార్ కిడ్ టైగర్ ఒక్కో సినిమాకు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పటి నుంచి రాబోయే సినిమాలకు 10 కోట్ల కంటే తక్కువే అందుతుంది అన్నమాట.

అలా చేస్తేనే తర్వాత సినిమాల్లో ఛాన్స్. లేకపోతే, ఈ స్టార్ కిడ్ కేవలం బాడీ బిల్డింగ్ చేసుకోవడమే కానీ, సినిమాలు చేయడం కష్టమే అంటున్నారు బాలీవుడ్ జనాలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు