Rajamouli: ఆస్కార్ అందుకునే ముందు కీరవాణితో ప్రాక్టీస్ చేయించాం.

ఎం ఎం కీరవాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు ఎం ఎం కీరవాణి. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే మనకున్న శక్తి సరిపోదు మనకున్న స్థాయి సరిపోదు అని కూడా చెప్పొచ్చు అంత అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వటం కీరవానికి మాత్రమే సాధ్యం. కేవలం అద్భుతమైన మ్యూజిక్ ని అందించడమే కాకుండా, తన గాత్రంతో కూడా ఏడిపించగలిగే సామర్థ్యం ఉన్న సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి.

కీరవాణి తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. కీరవాణి సంగీతానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బైస్ ఉంటుంది. కేవలం సంగీతాన్ని అందించడం పాడటం మాత్రమే కాకుండా మనుషుల్ని కదిలించగలిగే సాహిత్యాన్ని కూడా రాయగల సామర్థ్యం ఉన్న సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి.

ఎం ఎం కీరవాణి ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజమౌళి సినిమాలకు సంగీతం అందించడం అనేది ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ వచ్చారు. ఎస్ ఎస్ రాజమౌళి కి ఎన్నో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ అందించారు కీరవాణి.ఎస్.ఎస్ రాజమౌళి సినిమాల్లో హీరోలకు ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హీరోకి ఎలివేషన్ షాట్స్ ను తీసేసిన తర్వాత, ఆ తీసిన షాట్స్ కి కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి ఆడియన్స్ కి ఒక హై ఇస్తుంది.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా ఆస్కార్ అవార్డుని కూడా సాధించుకున్నారు కీరవాణి. కీరవాణి సంగీతం అందించిన సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా సాధించిన విషయాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడో ఉన్న ఆస్కార్ అవార్డును కూడా ఈ సినిమా అందుకుంది అంటే అది మామూలు విషయం కాదు. తెలుగు సినిమా స్థాయిని తెలుగు సినిమా కీర్తిని ఖండాలు దాటేలా చేసింది ట్రిపుల్ ఆర్ సినిమా.

ఇకపోతే ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు సాంగ్ అవార్డును సాధించుకుంది. అయితే ఈ సాంగ్ కచ్చితంగా అవార్డు సాధిస్తుంది అని కీరవాణి కూడా బలంగా నమ్మారు. దీంతో ఆస్కార్ ఈ పాటకి లభిస్తే అక్కడ ఎలా అవార్డు రిసీవ్ చేసుకుని స్పీచ్ ఇవ్వాలి అని కొంచెం ముందు నుంచి ఇంట్లో ప్రాక్టీస్ చేయించారట రాజమౌళి.

మామూలుగా ఎంఎం కీరవాణి కొంచెం బొద్దుగా లావుగా ఉంటారు. అయితే ఆస్కార్ రాగానే త్వరగా పరిగెట్టకుండా, స్లోగా నడుస్తూ అక్కడికి వెళ్ళగానే అలసిపోకుండా చాలా తొందరగా స్పీచ్ ను కంప్లీట్ చేయాలని చెప్తూ ప్రాక్టీస్ చేయించారని చెప్పుకొచ్చాడు రాజమౌళి. కానీ అవార్డు అనౌన్స్ చేయగానే కీరవాణి అన్ని మర్చిపోయి చాలా తొందరగా అవార్డు తీసుకోవడానికి వెళ్లి, కొద్దిపాటి అలసటతో త్వరగా స్పీచ్ ని కంప్లీట్ చేశారంటూ చెప్పుకొచ్చారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు