MM.Keeravani: ఆస్కార్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు – కీరవాణి..!

MM.Keeravani:  తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి – కీరవాణి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రాజమౌళి చిత్రాలకు దాదాపుగా కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉంటారు. ఇటీవల నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రము జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బిన్నీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి పాటలు ఎం ఎం కీరవాణి అందించడంతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలేకరులతో చిత్ర బృందం సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇలా అడుగుతూ నా సామిరంగ సినిమాకి మీ ఆస్కార్ హైప్ ప్రభావం ఎలా ఉంటుంది అని అడగగా.. కీరవాణి మాట్లాడుతూ.. నేను మొదటి నుంచే సెలెక్టివ్ గా సినిమాలను చేస్తూ ఉన్నాను.. సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారా మాత్రమే వస్తుంది. ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్ కి కొంత భాగం మాత్రమే పని చేస్తుందని భావిస్తాను అంటూ తెలిపారు. తన వరకు బాగా వర్క్ చేయాలి.. డైరెక్టర్ బాగా తీయాలి.. అప్పుడే జనాలకు ఆ సబ్జెక్టు కనెక్ట్ కావాలని తెలిపారు.

ఆ తర్వాత నా సామిరంగ సినిమాకి పనిచేయడంలో ఆసక్తిగా అనిపించిన అంశాలు ఏమిటి అని అడగగా..? అందుకు కీరవాణి మరొకసారి మాట్లాడుతూ.. నాగార్జునతో పని చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య అని.. మా కాంబినేషన్ ఎప్పుడూ కూడా విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా కూడా మంచి విజయం అవుతుందని నమ్మకంగా ఉందంటూ తెలిపారు.. కొత్త దర్శకుడు బిన్నీ కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.. కొత్త దర్శకుడు ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో పని చేస్తుంటారని తెలిపారు..

- Advertisement -

నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అన్నమయ్య, అల్లరి అల్లుడు, శ్రీరామదాసు ఇలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేశారని తెలిపారు. ఈ మధ్యకాలంలో మ్యూజిక్ పరంగా మిమ్మల్ని మెప్పించిన సినిమాలేవి అని అడగగా..? అందుకు కీరవాణి.. యానిమల్, జైలర్ సినిమాల మ్యూజిక్ బాగున్నాయని తెలిపారు. రాజమౌళి చేయబోయే సినిమా వర్క్ ఎప్పటి నుంచి ఉంటుంది అని అడగగా.. ఈ విషయం తెలియాలి అంటే రాజమౌళి కి ఫోన్ చేసి కనుక్కోవాలి.. ఫోన్ చేస్తే అది ఆఫ్ లో ఉంటుంది అంటూ నవ్వుతూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే వర్క్ ఇంకా తన వరకు రాలేదని అర్థమని తెలిపారు కీరవాణి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు