Shailesh Kolanu: ఫైనల్ గా “గేమ్ ఛేంజర్” మూవీ డైరెక్షన్ పై నోరు విప్పాడు… అసలు స్టోరీ ఇదేనట

Shailesh Kolanu: యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఎట్టకేలకు “గేమ్ ఛేంజర్”మూవీ డైరెక్షన్ పై నోరు విప్పాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడుతూ అసలు విషయం ఏంటో వెల్లడించాడు. గత కొన్ని రోజులుగా “గేమ్ ఛేంజర్” మూవీకి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ వస్తున్న రూమర్లపై స్పందిస్తూ ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మరి ఇంతకూ “గేమ్ ఛేంజర్” మూవీ విషయంలో జరుగుతున్న అసలు స్టోరీ ఏంటి? ఆ మూవీకి శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా ఈ యంగ్ డైరెక్టర్ శైలేష్ అవసరం ఏం వచ్చింది? ఆయన ఎందుకు “గేమ్ ఛేంజర్” సెట్స్ లో అడుగు పెట్టాల్సి వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే…

ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “గేమ్ ఛేంజర్”. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, కోలీవుడ్ బడా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొంతవరకు పూర్తయిన తర్వాత అడ్డంకులు మొదలయ్యాయి. డైరెక్టర్ శంకర్ అదే సమయంలో కమల్ హాసన్ “భారతీయుడు 2” సినిమాకు కమిట్ కావడంతో “గేమ్ ఛేంజర్” షూటింగ్ మూలన పడింది. చాలా రోజులపాటు ఈ మూవీ షూటింగ్ నత్తనడకన సాగింది.

అలా ఈ మూవీ షూటింగ్ రోజు రోజుకు ఆలస్యం అవుతూనే ఉంది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇక శంకర్ “భారతీయుడు 2” షూటింగ్లో బిజీగా మారడంతో, రామ్ చరణ్ వెయిటింగ్ మోడ్ లో ఉండాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో మరో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను “గేమ్ ఛేంజర్” సెట్స్ లో కనిపించడంతో ఈ మూవీ మిగతా భాగాన్ని ఆయనే తెరకెక్కించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు డైరెక్టర్ శైలేష్.

- Advertisement -

డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందిన తాజా మూవీ “సైంధవ్” సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా “గేమ్ ఛేంజర్” డైరెక్షన్ ప్రస్తావన వచ్చింది. శైలేష్ ఈ విషయంపై స్పందిస్తూ ఇందులో దాచి పెట్టాల్సింది ఏమీ లేదని, సినిమాలో మెయిన్ యాక్టర్స్ లేకుండా తీసే కొన్ని బీ రోల్ సీన్స్ మాత్రమే తాను ఈ మూవీ కోసం తీసానని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎవరికి డైరెక్షన్ విషయంలో చిన్న పనిని కూడా అప్పజెప్పని శంకర్ ఒకానొక లొకేషన్ లో స్ట్రక్ అవ్వడంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఆ బి రోల్ సీన్స్ ను చేయాలని అన్నారట. దీంతో వెంటనే నిర్మాత దిల్ రాజు తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారట.

దీంతో శంకర్ గారికి ఓకేనా? ఆయన ఇలాంటి విషయాల్లో చాలా స్పెసిఫిక్ గా ఉంటారని విన్నాను అని ప్రశ్నించారట. దిల్ రాజు భరోసా ఇవ్వడంతో కేవలం రెండు రోజులు కొన్ని చిన్న చిన్న డ్రోన్ సన్నివేశాలు తీశానని, అంతేకానీ ఈ మూవీలో ఒక పార్ట్ తానే తీశాను అనేది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. ఇక దిల్ రాజు తనకు ఫ్యామిలీ లాంటివారని, రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని, శంకర్ సినిమాలోను తను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి వాళ్లు అడగ్గానే ఎస్ చెప్పేసానని, “గేమ్ ఛేంజర్”కి సంబంధించిన ఇతర విషయాలేవీ తనకు తెలియవు అని చెప్పుకొచ్చాడు. అయితే శంకర్ స్ట్రక్ అయ్యింది “భారతీయుడు 2” షూటింగ్ లోనే అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు