Saipallavi: సాయి పల్లవికి అండగా తెలుగు స్టార్ సెలబ్రెటీస్.. ఎవరంటే..?

టాలీవుడ్ హీరోయిన్.. నాచురల్ బ్యూటీగా పేరుపొందిన సాయి పల్లవి తన కెరియర్లో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముద్ర వేసుకొని దూసుకుపోతోంది.. మరొకవైపు రోజురోజుకి తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా అభిమానుల నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా ప్రతి సినిమా కథ ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ తన పాత్రతో మైమరిపిస్తూ ఉంటుంది.

సాయి పల్లవికి అండగా స్టార్స్..
ఇదిలా ఉండగా సాయి పల్లవి అంటే అభిమానులకే కాదు స్టార్ సెలబ్రిటీలకి కూడా ఇష్టనే.. ఈ క్రమంలోనే సాయి పల్లవి సినీ పరిశ్రమలో ఏదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామంటూ ముందుకు వచ్చే టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు.. ముఖ్యంగా సాయి పల్లవికి టాలీవుడ్ లో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట. అందులో ప్రధానంగా అక్కినేని హీరో నాగచైతన్య తో పాటూ హీరో దగ్గుపాటి రానా అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు సాయి పల్లవికి ఎటువంటి సమస్య వచ్చినా తీర్చడానికి ముందు వరసలో ఉంటారని సమాచారం.

ఈ ముగ్గురితో సాయి పల్లవి ప్రయాణం..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి క్రేజీ సొంతం చేసుకుంది.. అలా శేఖర్ కమ్ములతో మంచి స్నేహబంధం ఏర్పడింది.. ఇక రానా తో విరాటపర్వం సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నాగచైతన్య తో లవ్ స్టోరీ సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ జంట ఇప్పటికీ మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ జంట తాజాగా తండేల్ సినిమాలో నటిస్తున్నారు.. మొత్తానికి టాలీవుడ్ లో సాయి పల్లవికి ఈ ముగ్గురు సెలబ్రిటీల తో మంచి స్నేహబంధం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సాయి పల్లవి కెరియర్..
గతంలో సాయి పల్లవి సినిమాలను వదిలేసి తన వృత్తిపరమైన డాక్టర్ కోర్సును పూర్తి చేసి ఒక హాస్పిటల్ ని మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. అందుకు తగ్గట్టుగానే ఈమె ఎలాంటి సినిమాలను కూడా రెండేళ్లపాటు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో ఒకవైపు సినిమాలకు దూరం కాబోతోంది అనే రూమర్స్ తో పాటు వివాహం చేసుకోబోతోందనే రూమర్స్ కూడా చాలా గట్టిగానే వినిపించాయి.. కానీ చివరిగా నాగచైతన్యతో తండేల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అలాంటి వార్తలు అన్నిటికి కూడా చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ..

ఘనంగా చెల్లి పెళ్లి..
ఇదిలా వుండగా గడిచిన కొద్ది రోజుల క్రితం తన చెల్లి పూజా కన్నన్ వివాహాన్ని దగ్గరుండి మరీ జరిపించింది ఈ ముద్దుగుమ్మ.. తాను వివాహం చేసుకోకుండానే తన చెల్లికి వివాహం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఎప్పుడు వివాహం చేసుకుంటుందనే వార్తలు వైరల్ కాగా ఈ విషయంపై మాత్రం సాయి పల్లవి స్పందించకపోవడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు