Sai Pallavi: అలాంటి పాత్రలకే మొదటి ప్రాధాన్యత.. లైనప్ చూస్తే షాక్..!

తెలుగు ప్రేక్షకులలో హీరోయిన్ సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో డాక్టర్ గా కెరీర్ ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. నేచురల్ బ్యూటీగా పేరుపొందిన సాయి పల్లవి అదిరిపోయే డ్యాన్స్ స్టెప్ లతో , అందం , అభినయంతో ఎంతోమంది కుర్రకారు కలల రాణిగా పేరు సంపాదించింది. ఎలాంటి పాత్రలలోనైనా సరే లీనమైపోయి మరీ నటిస్తూ ఉంటుంది సాయి పల్లవి. సినిమాలలో తన పాత్రలపరంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడమే కాదు తన కుటుంబ పరంగా కూడా బాధ్యతలను చేపట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల తన చెల్లెలు పూజా కన్నన్ నిశ్చితార్థాన్ని కూడా చాలా గ్రాండ్ గా జరిపించింది.

ఈ వేడుకలలో కూడా సాయి పల్లవి తన డాన్స్ తో ఫిదా చేసింది.. ఇప్పటికీ ఈ వీడియో అక్కడక్కడ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. సాయి పల్లవి డాన్స్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఫిదా అయిన విషయం తెలిసిందే. ఇకపోతే పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్న సాయి పల్లవి.. చివరిగా గార్గి సినిమా తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు. చాలాకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ తెర పై కనిపించబోతున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై అలాంటి పాత్రలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను అని చెబుతోంది. అందులో భాగంగానే భావోద్వేగాలకు పెద్దపీట వేసే పాత్రలకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ఇక అందులో భాగంగానే తాను ఎంచుకున్న సినిమాల కథలు చూస్తే అర్థమవుతుంది.

ఇక తాజాగా సాయి పల్లవి లైనప్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకున్న ఈమె మరొకసారి నాగచైతన్యతో జతకట్టబోతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇందులో సాయి పల్లవి పాత్ర విషయానికి వస్తే.. స్నేహితుడి కోసం పాకిస్తాన్ వెళ్లి చిక్కుకుపోయిన ప్రియుడు కోసం పోరాటం చేసే యువతిగా దర్శకుడు చందు మొండేటి తన పాత్రను చాలా డెప్త్ గా డిజైన్ చేశారట. మరోపక్క శివ కార్తికేయన్ సరసన చేస్తున్న సినిమాలో స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజ్ భార్యగా కనిపిస్తుందని సమాచారం. కమలహాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం హీరో నిజంగానే కఠినమైన మిలిటరీ శిక్షణ తీసుకోవడం విశేషం. .

- Advertisement -

అలాగే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జత కట్టిన సినిమా కూడా హెవీ లవ్ అండ్ ఎమోషనల్ గా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కీలక దశలో ఉండగా.. ప్రస్తుతం షెడ్యూల్ విదేశాలలో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు తప్ప మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు