Weight Loss : రొమాన్స్ తో వెయిట్ లాస్… పైసా ఖర్చు లేని పని

ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్న లైఫ్ స్టైల్ కారణంగా ఈజీగా వెయిట్ పెరిగిపోతున్నారు జనాలు. చిన్నా పెద్దా తేడా లేకుండా జంక్ ఫుడ్ కు అలవాటు పడి వెయిట్ లాస్ కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. ఎక్సర్సైజులు, వాకింగ్, ఏరోబిక్స్ వంటివి చేస్తూ చెమటోడుస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ చేసినా వెయిట్ తగ్గి సన్నబడాలి అంటే చాలా సమయం పడుతుంది. అలాగే డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. మరి పైసా ఖర్చు లేకుండా వెయిట్ లాస్ అవ్వొచ్చు అన్న విషయం మీకు తెలుసా? అది కూడా రొమాన్స్ చేస్తూ…

సాధారణంగా ప్రేమలో ఉన్నవారు సంతోషంగా కనిపిస్తారు. అలాగే ఒత్తిడి ఫీల్ అవ్వరు. ఎందుకంటే వాళ్లపై ప్రేమను కురిపించే వ్యక్తి ఒకరు వాళ్ళ జీవితంలో ఉంటారు. ఆ ప్రేమను అనేక రకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు. అందులో ముద్దు కూడా ఒకటి. ఆ ముద్దు ద్వారానే వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇంకా ముద్దు ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ముద్దు హార్ట్ హెల్త్ ను కాపాడడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఆయుష్షును పెంచుతుందట. ప్రేమతో ముద్దు ఇచ్చినప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది. దీనివల్ల గుండెలో రక్త ప్రసరణ పెరిగి తలనొప్పి, తిమ్మిర్లు వంటివి తగ్గిపోతాయి. అలాగే ముద్దు పెట్టుకున్న సమయంలో శరీరంలో ప్రేమ హార్మోన్ ఆక్సిటోసిన్ పెరుగుతుంది. దీంతో ఇద్దరి మధ్య ఒత్తిడి తగ్గి సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే ముద్దు పెట్టుకునే సమయంలో మన మెదడు ఎండార్ఫిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా విచారంగా అనిపిస్తే ప్రియురాలికి ఓ ముద్దు పెట్టేయండి.

ఇక సాధారణంగా నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల దంతాలు కుళ్ళిపోతాయి. కానీ ముద్దు పెట్టుకుంటే మాత్రం ఒకరి నోట్లోని లాలాజలం మరొకరి నోటిలోకి వెళ్లి రోగనిరోధక శక్తిని పెంచేస్తుంది. ఎవరైనా ఉద్రేకంగా ముద్దు పెట్టుకున్నప్పుడు 10 మిలియన్ల నుండి 1 బిలియన్ల మధ్య వివిధ రకాల బ్యాక్టీరియా ఒకరి నోట్లో నుండి మరొకరి నోట్లోకి వెళ్తుంది. ప్రతిరోజూ ప్రియురాలిని ముద్దు పెట్టుకునే పురుషులు ఐదు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారని, ఇతరుల కంటే ఎక్కువగా సంపాదిస్తారని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. ఇదంతా సరే ఇంతకీ వెయిట్ లాస్ సంగతేంటి అంటే… ముద్దు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో 26 క్యాలరీలు కరిగిపోతాయి. 15 నిమిషాలు ముద్దు పెట్టుకుంటే 400 క్యాలరీలు… అంటే గంటసేపు వాకింగ్ చేస్తే కరిగే క్యాలరీలు కేవలం 15 నిమిషాల ముద్దుతో ఖర్చవుతాయన్నమాట. ఈ విధంగా ఎక్సర్సైజ్ లాంటివి చేయకుండానే ఈజీగా ముద్దుతో బరువు తగ్గుతారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు