Prashanth Varma : కొంతకాలం జై హనుమాన్ పక్కన పెడుతున్నాడా.?

‘ఆ’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా థియేటర్ వద్ద కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక విలక్షణమైన దర్శకుడు దొరికాడు అనే ప్రశంసలు కూడా ప్రశాంత్ వర్మకి లభించాయి. ఈ సినిమాను నాని నిర్మించాడు. ఈ సినిమాలో రవితేజ వాయిస్ ఓవర్ కూడా అక్కడక్కడ వినిపిస్తుంది. ఈ సినిమాతో చాలామందిని ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్ వర్మ.

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ డాక్టర్ రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా విమర్శకులు ప్రశంసలను అందుకుంది అయితే కమర్షియల్ గా మాత్రం ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత జాంబి రెడ్డి అనే సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్. ఈ సినిమా డైరెక్టర్ ఓటిటిలో రిలీజ్ అయింది.

ఇకపోతే ప్రశాంత్ వర్మ గురించి చాలామందికి తెలిసిందే. తన దగ్గర చాలా కథలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తాడు ప్రశాంత్. అయితే హనుమాన్ సినిమాతో అద్భుతమైన ఘనవిజయం సాధించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే సంక్రాంతి బరిలో చాలా పెద్ద సినిమాలతో పాటు ఈ సినిమా రిలీజ్ అయింది. అలాంటి పెద్ద సినిమాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా కూడా ఒకటి.

- Advertisement -

హనుమాన్ సినిమాకి థియేటర్ లో చాలా తక్కువగా లభించాయి. మామూలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. అయితే కేవలం 5 సింగిల్ స్క్రీన్ ధియేటర్ మాత్రమే హనుమాన్ సినిమాకి దొరికాయి. అయితే ఆ తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కూడా థియేటర్లు పెరుగుతూ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమా.

హనుమాన్ విజయం సాధించిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాను చేస్తున్నట్టు ఇదివరకే అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందంటూ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నట్టు తెలుస్తుంది.

ఇకపోతే ప్రశాంత్ వర్మ ఇదివరకే ఆక్టోపస్ అనే ఒక ప్రాజెక్టును అనౌన్స్ చేసి అనుపమ పరమేశ్వరన్ ను పెట్టి ఒక సినిమాను చేశాడు. దాదాపు ఈ షూటింగ్ 65% వరకు పూర్తయింది. అయితే ఆ ప్రాజెక్ట్ ను కొంత కాలం పాటు పక్కన పెట్టేసాడు ప్రశాంత్. ఇకపోతే హనుమాన్ కాస్టింగ్ పెండింగ్ దశలో ఉండటం వలన మళ్ళీ ఇదే సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు