Jai Hanuman: అప్పుడే ఫస్ట్ లుక్… యమ స్పీడ్‌లో యంగ్ డైరెక్టర్

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది హనుమాన్. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు కూడా చాలా ఆలోచనలు మొదలయ్యాయి చిత్ర యూనిట్‌కి. ఎందుకంటే ఈ సినిమాకి సరిగ్గా థియేటర్లు కూడా దొరకలేదు. హైదరాబాద్ లో సింగిల్స్ స్క్రీన్ థియేటర్లు కేవలం ఐదు అంటే ఐదు మాత్రమే ఈ సినిమాకు దొరికాయి. దీనికి కారణం అప్పటికే సంక్రాంతికి చాలా సినిమాలు ఉండటం.

సూపర్ సార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో రావడం వలన అన్ని థియేటర్స్ ను ఇదే సినిమా ఆక్యుపై చేసింది. అందుకే చాలా సినిమాలకు థియేటర్స్ లేకుండా అయిపోయింది. అయితే హనుమాన్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సాధించుకుంది.

హనుమాన్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందర్నీ ఈ హనుమాన్ సినిమా ఆకట్టుకుంది. ఈ హనుమాన్ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానం అద్భుతం. థియేటర్లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కి కూడా ఒక రకమైన అనుభూతి కలిగింది. అంత అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ.

- Advertisement -

అయితే హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా టాక్ బాగా రావడం వలన చాలా థియేటర్లను తర్వాత కేటాయించారు. అయితే ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే సినిమా చివర్లో వచ్చే ఐదు నిమిషాలు మాత్రం ఒక ఎత్తు అని చెప్పవచ్చు. ఆంజనేయులు వారిని చూపించిన విధానం. ఆ బిజిఎం, ఆ ఎలివేషన్స్ అన్ని సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి.

జై హనుమాన్ ఫస్ట్ లుక్ అప్డేట్…
హనుమాన్ సినిమా జరుగుతున్న తరుణంలోని జై హనుమాన్ అనే సినిమాను చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అయితే ఈ జై హనుమాన్ కి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే హనుమాన్ క్లైమాక్స్ లో ఎటువంటి హై అయితే ఉందో జై హనుమాన్ లో ఆ హై రెండు గంటల పాటు ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను కూడా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.

మంచి కాంపిటీషన్లో వచ్చి తన సత్తా ఏంటో చూపించింది హనుమాన్ సినిమా. నెక్స్ట్ వచ్చే జై హనుమాన్ కి మినిమం కాంపిటీషన్ లేకుండా మంచి రిలీజ్ డేట్ దొరికితే అది కూడా అద్భుతంగా స్కోర్ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మరో రేంజ్ లో నిలబెడుతుందని చెప్పొచ్చు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు