Prashanth Varma : అల్ట్రా లగ్జరీ కారు కొంటున్న “హనుమాన్” డైరెక్టర్

Prashanth Varma

“హనుమాన్” మూవీ సక్సెస్ తో ఇప్పటిదాకా చిన్న దర్శకుడిగా టాలీవుడ్ లో నెట్టుకొస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫేట్ మారిపోయింది. “హనుమాన్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయనకు దేశవ్యాప్తంగా పాపులరిటీ దక్కింది. ఇప్పుడు ప్రశాంత్ పాన్ ఇండియా డైరెక్టర్. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో చిన్న చిత్రంగా రిలీజ్ అయిన “హనుమాన్” 250 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. “హనుమాన్” మూవీ థియేటర్లలో రిలీజ్ అయి 20 రోజులు కావస్తున్నా సందడి ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక కొత్త కారు బుక్ చేసుకున్నాడని, దానికోసం కోట్లు కుమ్మరిస్తున్నాడని సమాచారం.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ “హనుమాన్” మూవీ సాధించిన అద్భుతమైన సక్సెస్ తో ఫుల్ ఖుషి గా ఉన్నాడు. ఇంత తక్కువ బడ్జెట్ లో రూపొందించిన మూవీతో కేజిఎఫ్, బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసేసారు. ఈ మూవీ 100 కోట్ల లాభాలను గడించి పెట్టడంతో “హనుమాన్” టీం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ తన చిరకాల కోరికను తీర్చుకునే పనిలో పడ్డారు. “హనుమాన్” సక్సెస్ అయిన సందర్భంగా ప్రశాంత్ వర్మ ఒక అల్ట్రా లగ్జరీ కారుని బుక్ చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ గ్యారేజ్ లో కాస్ట్లీ కారు మెర్సిడెస్ బెంజ్ ఉండగా, ఇప్పుడు మరో విలాసంతమైన కారు రాబోతోంది. 6 కోట్ల విలువైన లేటెస్ట్ వెర్షన్ రేంజ్ రోవర్ కారును ప్రశాంత్ వర్మ కొనబోతున్నాడని సమాచారం. ఇప్పటికే దీన్ని బుక్ చేసుకోగా, త్వరలోనే ఆ రేంజ్ రోవర్ ప్రశాంత్ వర్మ గ్యారేజ్ లోకి రానుంది.

మొత్తానికి ప్రశాంత్ వర్మ “హనుమాన్ ” మూవీతో ఎంతోమంది అప్ కమింగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ గా నిలిచే దిశగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇక ప్రశాంత్ వర్మ లాగా కష్టపడి సక్సెస్ అయ్యే వాళ్లకు కీర్తితో పాటు సంపద, విలాసవంతమైన జీవితం సొంతమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు టాలీవుడ్ లో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

వాళ్లందరికీ ప్రశాంత్ వర్మ స్టోరీ తప్పకుండా ప్రేరణగా నిలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా “హనుమాన్” మేకర్స్ 3D వెర్షన్ ను రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు “హనుమాన్” మూవీకి సీక్వెల్ గా “జై హనుమాన్” రూపుదిద్దుకోబోతోంది. అలాగే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో రూపొందబోయే సూపర్ హీరో సినిమాలు ప్రతి సంక్రాంతికి విడుదలవుతాయి అన్న విషయాన్ని ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ప్రకటించారు. మొత్తానికి “హనుమాన్” ఆశీస్సులతో ప్రశాంత్ వర్మ కలలు నిజం అయ్యాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు