The Goat Life : టైటిల్ కూడా ఉన్నది ఉన్నట్టే.. ఇలా అయితే ఎలా?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయినా, ఆయా సినిమాల ఒరిజినల్ వెర్షన్ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ్, మలయాళం సినిమాలు తెలుగు లో డబ్ చేస్తుంటే ఆ సినిమాల టైటిల్స్ ని కూడా డైరెక్టర్లు తమిళ్, మలయాళ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. చాలా మంది తెలుగు ఆడియన్స్ కి ఆ టైటిల్స్ అర్ధం కాకపోవడం వల్ల కొంతమంది సినిమాలు కూడా చూడట్లేదు. ఇది ఒకరకమైన భాషాభిమానం అని కూడా అనిపిస్తుంది.

లాస్ట్ ఇయర్ అజిత్ నటించిన తునీవు సినిమాని అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేసారు. అలాగే లారెన్స్ నటించిన జిగర్తాండ సినిమాని కూడా అదే టైటిల్ పేరుతో రిలీజ్ చేసారు. ఇక లేటెస్ట్ గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆడుజీవితం’. ఈ సినిమా టైటిల్ ని కూడా ఇదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సినిమా టైటిల్ అర్ధం కాకపోతే కూడా ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించకపోయే అవకాశం ఉంది. ఒకవేళ కంటెంట్ బాగున్నా, ఆ సినిమా పై ఆడియన్స్ మొగ్గు చూపడానికి ఆలస్యం అవుతుంది.

మరి ఇది డబ్బింగ్ సినిమాల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎప్పుడు అర్ధమవుద్దో. ఇక ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత అయిన ఈ డైరెక్టర్ బ్లేస్సి తనే నిర్మించి డైరెక్ట్ చేశాడు. ‘ఆడుజీవితం’ (‘ది గోట్ లైఫ్ )’, బెన్యామీన్ అనే వ్యక్తి రాసిన “గోట్ డేస్” అనే మలయాళ నవల ఆధారంగా రూపొందించబడింది. ఇక తెలుగు వెర్షన్ ను మైత్రి మూవీ మేకర్స్ వారు కొనుక్కోగా, AR రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను మలయాళం తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు