Aadujeevitham: మలయాళం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆడుజీవితం’. ఈ సినిమా కి సంబంధించిన ఆఫిషియల్ ట్రైలర్ ని నిన్న యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అప్డేట్ గాని, ట్రైలర్ అప్డేట్ గాని ఏమి చెప్పకుండా సడన్ గా చిత్ర యూనిట్ విడుదల చేశారు. అయితే ఈ విషయం పై హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తన ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో ట్రైలర్‌ను లాంచ్ చేస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా ట్వీట్ వేశాడు. “అవును, ఇది అనుకోకుండా జరిగింది. కానీ, ఇది ఆన్‌లైన్‌లో లీక్ కావడానికి ఉద్దేశించబడలేదు. ఫెస్టివల్ సర్క్యూట్‌ల కోసం ప్రత్యేకంగా కట్ చేసిన ఆడుజీవితం ట్రైలర్ ఆన్‌లైన్‌లో ఉందని మీలో చాలా మందికి తెలిసిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇదిగో, “ది ఆడుజీవితం”, (ది గోట్ లైఫ్), అన్ ఫినిషడ్  (పనిలో ఉంది) మీరు చూసేది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము” అని ట్వీట్ వేశాడు.

అంతే కాదు ఈ “ట్రైలర్ కేన్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్” లో ప్రదర్శించడానికి ప్రత్యేకంగా రెడీ చేశామని సుకుమార్ చెప్పుకొచ్చాడు. కానీ ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత, చివరకు మేకర్స్ అధికారికంగా ట్రైలర్ ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ట్రైలర్ ను చుసిన తర్వాత ఇందులో సుకుమార్ పెర్ఫార్మన్స్ సూపర్ గా ఉంది. డాక్యుమెంటరీ వీడియో లాగా అనిపించినా, చూడ్డానికి చాలా బాగుంది. ట్రైలర్ లో పెద్దగా డైలాగులు లేకున్నా, ఎమోషన్స్ తోనే సినిమా కాన్సెప్ట్ ను అర్థం చేసుకునేలా ఉంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఈ డైరెక్టర్ బ్లేస్సి ఈ సినిమాను తనే నిర్మించి డైరెక్ట్ చేశాడు.

- Advertisement -

‘ఆడుజీవితం’ (‘ది గోట్ లైఫ్ )’, బెన్యామీన్ అనే వ్యక్తి రాసిన “గోట్ డేస్” అనే మలయాళ నవల ఆధారంగా రూపొందించబడింది. ఆడుజీవితం సినిమా లో పృథ్వీరాజ్ నజీబ్ అనే కేరళ వలస కార్మికుడిగా నటించాడు. మెరుగైన బతుకు కోసం కలలు కనే నజీబ్ జీవితం సౌదీ అరేబియా ఎడారిలో ఎలా ముగుస్తుంది, అక్కడ అతను మేకలని మేపుకుంటూ జీవించవలసి వస్తుంది. ఎలా బతుకు చాలించాడు అనేది కథ. పృథ్వీరాజ్ సుకుమారన్ దాదాపుగా గుర్తించలేని మేక్ఓవర్ లో చాలా రియలిస్టిక్ గా కనిపించాడు. బ్లెస్సీ దర్శకత్వ ప్రతిభ ఇందులో ప్రతి చోట కనబడింది. AR రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను మలయాళం తో పాటు అరబిక్ లోను నిర్మించగా, 2023 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు