Niharika-Chaitanya: ఫలించిన ‘చిరు’ రాయభారం?

మెగా డాటర్ నిహారిక, తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా చైతన్య ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట్లో చాలా అన్యోనంగా ఉన్న వీళ్లిద్దరు కొంతకాలంగా దూర, దూరంగా ఉంటున్నారు. అయితే భార్య భర్తలన్నాక చిన్న, చిన్న గొడవలు రావడం కామనే కదా అందులో ఏముంది అనుకుంటే పొరపాటే,  అది నార్మల్ పీపుల్ కి కామనే కానీ సెలెబ్రెటీల వ్యవహారం వేరేలా ఉంటుంది. చిన్న, చిన్న బేధాభిప్రాయాలు రావడమే ఆలస్యం వెంటనే డైవర్స్. కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొకపెళ్లి చేసుకోడానికి రెడీ అవుతున్నారు. డబ్బు వల్లనో లేక ఇండిపెండెంట్ బతకడం అలవాటు పడటం వల్లనో ఏమో కానీ ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ గా మారింది. ప్రస్తుతం నిహారిక విషయంలోను ఇదే జరిగేలా ఉంది.

గత కొంతకాలంగా నిహారిక , చైతన్య మధ్య తరుచు గొడవలు అవుతున్నాయి. నిహారిక సినిమాల్లో నటించడం చైతన్య కి ఇష్టం లేదు. కానీ నిహారిక యాక్టింగ్ చేస్తాను అని వాదించడం తో గొడవలు ముదిరాయి. నిహారిక చైతన్య మాట వినకుండా సినిమాలు ఒకే చేయడంతో చైతన్య ఇలా అయితే కలిసి ఉండలేము అని చెప్పాడంట అయితే ప్రస్తుతం అఫిషల్ గా ఇద్దరికీ డైవర్స్ అవ్వకపోయిన, ఎవరికి వారే ఉంటున్నారు. సోషల్ మీడియా లో కూడా ఆన్ -ఫాలో చేసుకున్నారు. గతంలో వాళ్ళు దిగిన క్లోజ్ పిక్స్ అన్ని డిలీట్ చేసుకున్నారు.

నాగ బాబు కూతురు నిహారిక కి వేరే సంబంధాలు కూడా చూస్తున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి చిరంజీవి దాకా వెళ్ళింది. వెంటనే చిరంజీవి రియాక్ట్ అయ్యి నిహారిక, చైతన్య ఇద్దరితో మాట్లాడి సంధి కుదిర్చి మళ్ళీ ఇద్దరినీ కలిసిపోయేలా చేసారని వినిపిస్తోంది.నిహారిక ఇక సినిమాలు చేయను అని చిరుకి మాట ఇఛ్చినట్టు టాక్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు