#Kurchimadathapetti: కుర్చీ మడత పెట్టి రికార్డ్స్ పండబెట్టాడు

Kurchimadhapetti Song New Record: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో రచయితగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ మొదటి సినిమాతోనే తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. వరుస అవకాశాలను అందుకొని తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. పోస్టర్ పైన త్రివిక్రమ్ పేరు చూసి అప్పట్లో థియేటర్కు వెళ్ళిన ఆడియన్స్ కూడా ఉన్నారు. రచయితగా అంతటి బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు త్రివిక్రమ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని దర్శకుడుగా సెటిలైపోయాడు.

స్టార్ హీరోలతో సినిమాలు
త్రివిక్రమ్ కెరియర్ లో రెండు సినిమాలు మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలతోనే చేశాడు. తన మొదటి సినిమా నువ్వే నువ్వే తరుణ్ హీరోగా చేశాడు. మళ్లీ సన్నాఫ్ సత్యమూర్తి అనే బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, నితిన్ తో అ ఆ అనే సినిమాని చేశాడు. ఈ సినిమాను మినహాయిస్తే మిగతా స్టార్ హీరోలతో రిపీటెడ్ గా వర్క్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నువ్వే నువ్వే తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమా అతడు. ఆ సినిమా కమర్షియల్ గా అప్పట్లో పెద్దగా హిట్ కాలేదు. కానీ ఇప్పటికీ కూడా టీవీలో వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు. టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా మంచి రేటింగ్ నమోదు చేసుకుంటుంది ఈ సినిమా.

గుంటూరు కారం తో కమర్షియల్ హిట్ ప్రయత్నం
అతడు సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోవటం వలన, బాక్స్ ఆఫీస్ వద్ద ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను చేయాలి అని ఇద్దరు ఫిక్సయ్యారు. వీరిద్దరూ కలిసి రెండవసారి ఖలేజా అనే సినిమాను చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో మహేష్ బాబు కి మంచి పేరు వచ్చింది. మహేష్ లోని పరిపూర్ణమైన నటుడు బయటకు వచ్చాడు. దూకుడు సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి, మహేష్ లో ఆ కామెడీ టైమింగ్ బయటపడడానికి ఒక రకంగా ఖలేజా సినిమా అని చెప్పొచ్చు. అయితే అతడు ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వకపోవడం వలన, ఈసారి చేయబోయే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మరోసారి గుంటూరు కారం సినిమా కోసం ఇద్దరు ప్లాన్ చేశారు.

- Advertisement -
Kurchimadhapetti Song New Record
Kurchimadhapetti Song New Record

ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ కాపాడింది
సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా థియేటర్లో విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా నెగిటివ్ టాక్ తో మొదలైంది. ఆ తర్వాత మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ లభించాయి. ఇకపోతే ఈ సినిమా అనుకున్నంత బ్యాడ్ ఏమీ కాదు. కానీ ఊహించిన విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇకపోతే ఈ సినిమాకి ఎస్ తమన్ సంగీతం అందించాడు. అరవింద సమేత వీర రాఘవ సినిమా దగ్గరనుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తమన్ ట్రావెల్ చేస్తున్నాడు. అలానే మంచి ఆల్బమ్స్ కూడా ఇస్తున్నాడు. ఇక గుంటూరు కారం సినిమాకి సంబంధించి కూడా మంచి ట్యూన్స్ అందించాడు తమన్.

Kurchimadhapetti Song New Record
Kurchimadhapetti Song New Record

రికార్డ్స్ ను మడతపెట్టారు
ఇకపోతే గుంటూరు కారం సినిమాకు సంబంధించి కుర్చీని మడత పెట్టే అనే సాంగ్ ఒక సంచలనానికి ,వివాదానికి దారితీసింది. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో ఇలాంటి పాట ఉండటం ఏంటి అని చాలామంది విమర్శించారు. స్వతహాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహిత్యానికి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి దర్శకుడు సినిమాలో ఇటువంటి పాటను ఉండటం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఒక మాస్ కమర్షియల్ సినిమాను ఆడియన్స్ కి ఇద్దాం, మహేష్ బాబు లోని పరిపూర్ణమైన డాన్సర్ని బయటికి తీసి ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇద్దామని ఈ సాంగ్ ను చేశారు. అయితే ఈ సాంగ్ ట్రోల్ అయినా కూడా అద్భుతమైన రికార్డ్స్ ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ పాటకు 250 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ రోజుల్లో ఒక పాటకు మిలియన్ న్యూస్ రావటమే గగనం అనుకున్న తరుణంలో, ఈ పాటకు 250 మిలియన్ వ్యూస్ లభించడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా కుర్చీ మడతపెట్టి పాటతో చాలా రికార్డ్స్ ని పడుకుని పెట్టారు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు