Samantha: సమంతకు షాక్ ఇచ్చిన ఇండస్ట్రీ ?

 

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ అంతా కాదు. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలు అడుగుపెట్టిన సమంత… దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది. అప్పటినుంచి ఇప్పటివరకు టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ గానే సమంత దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత లైఫ్ మరొక లాగా మారిపోయింది.

జీవితంలో అన్ని కష్టాలే అన్నట్లుగా సమంత లైఫ్ అయిపోయింది. ఇండస్ట్రీలో సరైన హిట్ లేక సతమతమవుతోంది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధి సమంతక సోకింది. ఈ వ్యాధితో ఇప్పటికి కూడా సమంత పోరాటం చేస్తూనే ఉంది. అటు శాకుంతలం , ఖుషి లాంటి సినిమాలు చేసిన కూడా పెద్ద హిట్ అందుకోలేదు.

- Advertisement -

దీనికి తగ్గట్టుగానే టాలీవుడ్ దర్శక నిర్మాతలు సమంతకు భారీ ప్రాజెక్టు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఎక్కువ శాతం కీర్తి సురేష్, రష్మిక, శ్రీ లీల లాంటి హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా ఛాన్స్ లు ఇస్తున్నారు. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సమంతకు ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న యానిమల్ సినిమాతో సక్సెస్ అందుకున్న రష్మిక… బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే… సమంతకు మాత్రం టాలీవుడ్ లో అలాగే బాలీవుడ్లో పెద్ద సినిమాలు తగలడం లేదు. కావాలనే సమంతను ఇలా చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఇండస్ట్రీ పై ఫైర్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు