Tollywood: ఆ హీరోయిన్ పై యాసిడ్ అటెంప్ట్?

Ester Noronha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఇక్కడి వారు ఉంటే కొంతమంది బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అయితే కెరీర్ ప్రారంభంలో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. అలాంటి హీరోయిన్లలో ఎస్తార్ ఒకరు. తన కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా ఇండస్ట్రీలు అడుగు పెట్టింది ఎస్తార్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

సింగర్ , బిగ్ బాస్ ఫ్రేమ్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. అయితే కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది. కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు.అయితే ఈ హాట్ బ్యూటీ భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, లాంటి సినిమాలలో హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్గా ఛాన్సులు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. ఇదే సమయంలో నోయల్ ప్రేమలో పడి వివాహం చేస్తుంది.

అయితే తాజాగా నోయల్ మాజీ భార్య ఎస్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నోయల్ గురించి భయంకరమైన నిజాలు చెప్పింది. నోయల్ నాతో విడిపోయాక తనపై చెడు ప్రచారం చేశాడని మండిపడింది. బిగ్ బాస్ లో సింపతి కోసం.. చాలా ప్రయత్నాలు చేశాడని ఆగ్రహించింది. ప్రేక్షకుల ముందు తనను విలన్ చేశాడని ఆమె ఫైర్ అయింది. దీంతో కొంతమంది సినీప్రియలు.. తనపై యాసిడ్ పోస్తానని బెదిరించారని చెప్పుకొచ్చింది. పెళ్లయిన 16 రోజులకే గొడవలు స్టార్ట్ అయ్యాయని… తనను బాగా టార్చర్ పెట్టాడని వెల్లడించింది ఎస్తర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు