Anushka Marriage: త్వరలో నిర్మాతతో అనుష్క పెళ్లి?

Anushka Marriage:  టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో గత 15 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది అనుష్క. అప్పుడెప్పుడో అక్కినేని నాగార్జున హీరోగా చేసిన సూపర్ సినిమాలో చిన్న పాత్రలోకి కనిపించి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క.

అప్పటినుంచి… ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా… లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి శభాష్ అనిపించింది. అరుంధతి ఇలాంటి సినిమా చేసి… హీరోయిన్ల క్రేజ్ పెంచింది అనుష్క. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలు తక్కువ చేసిన ఈ బ్యూటీ… మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరోసారి యూత్ ను అలరించింది.

ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా అనుష్కకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే 40 సంవత్సరాలు దాటినా కూడా అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ మధ్యకాలంలో ప్రభాస్ తో ఎఫైర్ పెట్టుకుందని అనుష్క పై వార్తలు వచ్చాయి. ఇంకా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కన్నడ సినీ నిర్మాతను అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అనుష్క అలాగే నిర్మాత ఇంటి పెద్దలు ఈ సంబంధం ఫిక్స్ చేశారట. మరో మూడు నెలల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు