Bunny-NTR: రామ్ చరణ్ ను కార్నర్ చేస్తున్నారా ?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో జరుగుతుంది అన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాఫిక్. ఈ రెండు ఫ్యామిలీస్ బాగానే ఉన్నాయి. ఎవరో గిట్టని వాళ్లు కొన్ని రూమర్స్ ను స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కొన్ని వాదనలు వినిపించినా, ఎక్కడో.. ఎప్పుడో.. మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య ఏవో తగాదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంలో బన్నీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అల్లు అర్జున్ ఉద్దేశ్య పూర్వకంగానే చరణ్ కి విష్ చేయలేదంటూ మెగా ఫ్యాన్స్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 8న స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుట్టిన రోజును జరుపుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు అందరూ బన్నీకి బర్త్ డే విసెష్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా “పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ బన్నీ. మెనీ హ్యాపీ రిటర్న్స్. #Pushpa2TheRule Rocks ఫస్ట్ లుక్ కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్” అంటూ ట్వీట్ చేశాడు. అయితే రామ్ చరణ్ నుంచి జస్ట్ విసెష్ మాత్రమే వచ్చాయి. “హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ యూ అల్లు అర్జున్” అంటూ సింపుల్ గా చరణ్ ట్వీట్ చేశాడు. దీనికి బన్నీ “థాంక్యూ మై స్వీటెస్ట్ బ్రదర్” అంటూ రిప్లై ఇచ్చాడు.

కానీ, బన్నీకి తారక్ చేసిన విసెష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్ డే బావ. హావ్ ఎ గ్రేట్ వన్” అంటూ జూనియర్ ఎన్టీఆర్ విష్ చేయగా, బన్నీ “థాంక్యూ ఫర్ యూవర్ లవ్లీ విసెష్ బావ.. వార్మ్ హగ్స్” అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి తారక్ “ఓన్లీ హగ్స్.. పార్టీ లేదా పుష్ప” అంటూ ట్వీట్ చేశాడు. మళ్లీ బన్నీ దీనికి “వస్తున్నా..” అంటూ రీ ట్వీట్ చేశాడు.

- Advertisement -

అయితే, రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రావడం. అలాగే, ఇటీవల ఆస్కార్ ఈవెంట్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య గ్యాప్ వచ్చిందంటూ కూడా టాక్ వచ్చిన సమయంలో అల్లు అర్జున్, తారక్ మధ్య ఇలాంటి చర్చ జరగడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాశంగా మారింది. రామ్ చరణ్ ను కార్నర్ చేయాలనే, అల్లు అర్జున్ తారక్ ఇలాంటి కన్వర్జేషన్ చేశారంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీనిపై ఈ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు