Shamitha Shetty: అనారోగ్య సమస్యలతో శిల్పా శెట్టి సోదరి..పోస్ట్ వైరల్..!

Shamitha Shetty.. అసలేమైందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ఇప్పటికే సమంత, మమతా మోహన్ దాస్, సోనాలి బింద్రే ఇలా చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమైన వారే.. ఇలాంటి వారి జాబితాలోకి ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు షమితా శెట్టి. తాజాగా తనకు వచ్చిన ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ఆమె చెప్పుకొచ్చింది.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ.. అందరికీ అవగాహన కల్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ..

అనారోగ్యం తో షమిత శెట్టి..

Shamitha Shetty: Telugu beauty suffering from such a problem..post viral..!
Shamitha Shetty: Telugu beauty suffering from such a problem..post viral..!

షమిత తనకు వచ్చిన ఈ సమస్య సర్వ సాధారణమని.. మహిళలకు ఇలాంటివి అత్యంత సాధారణంగా వస్తూ ఉంటాయని చెప్పుకు వచ్చింది.. ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికిందని కూడా చెప్పుకొచ్చింది. ఈ మేరకు హాస్పిటల్ లో సర్జరీ తర్వాత బెడ్ పై నుంచి ఒక వీడియోని వదిలింది ఈ ముద్దుగుమ్మ.

ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతున్న షమిత..

షమిత శెట్టి మాట్లాడుతూ.. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే సమస్యతో బాధపడుతున్నారని మీకు తెలుసా..? ముఖ్యంగా మనలో చాలామందికి ఈ వ్యాధి గురించి తెలియదు.. ఇక నా నొప్పికి మూల కారణాన్ని డాక్టర్లు కనుగొని దానికోసం వారి ఎంతో శ్రమించారు. డాక్టర్ నీతా వార్టీ, డాక్టర్ సునీత బెనర్జీ ఇద్దరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు.. శారీరకంగా నొప్పి లేని రోజులు.. మంచి ఆరోగ్యం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ షమిత చెప్పుకొచ్చింది..

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..

ఇక ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..” పిలిస్తే పలుకుతా” అంటూ అప్పట్లో ఆకాష్ తో కలిసి ఒక సినిమా చేసింది.. ఈ సినిమా సాయిబాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా.. ఈమె మాత్రం ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టింది. ఇక రీసెంట్ గా హిందీ బిగ్ బాస్ షోలో సందడి చేసిన షమిత ఎవరో కాదు ప్రముఖ నటి శిల్పా శెట్టి సోదరి.. ఈ నేపథ్యంలోనే ఈమెకి బాలీవుడ్లో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఇక ఈమె క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అక్కడ మంచి పేరు సొంతం చేసుకుంది.. కానీ ఇప్పుడు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా అని చెప్పి అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. మొత్తానికి అయితే శస్త్ర చికిత్స పూర్తయిన నేపథ్యంలో ఈమె తిరిగి కోలుకొని మళ్లీ మునుపటి లాగే సినిమాలలో బిజీ కావాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి శిల్పా శెట్టి చెల్లెలిగా గుర్తింపు తెచ్చుకున్న షమిత శెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు