Mega – Allu: విభేదాలు రావడానికి ఆ స్టార్ హీరోలే కారణమా.?

Mega -Allu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా – అల్లు ఫ్యామిలీ లకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అంతేకాదు అటు మెగా హీరోలు ఇటు అల్లు హీరోలు చేసే కొన్ని పనుల వల్ల నిజంగానే వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నాగబాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ లు చేసే పనుల వల్ల వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. కానీ ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు చిరంజీవి – అల్లు అరవింద్..

అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య దూరం..

Mega - Allu: Are those star heroes the cause of differences?
Mega – Allu: Are those star heroes the cause of differences?

అయితే ఇప్పుడు మళ్లీ ఇలాంటి వివాదమే ఒకటి తెరపైకి వచ్చింది.. దీనికి కారణం ఈసారి అల్లు అర్జున్ అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా అండగా ఉంటానని చెప్పిన అల్లు అర్జున్.. ఆ తర్వాత నంద్యాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన ఫ్రెండ్ రవి ఇంటికి భార్యతో సహా వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇక్కడే జనసైనికులు పూర్తిస్థాయిలో హర్ట్ అయ్యారు.. మరొకవైపు మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ చేసిన పనికి విమర్శలు చేయడం మొదలుపెట్టారు.. అలాగే నాగబాబు కూడా సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ మా వాడే కానీ పరాయివాడు అంటూ ట్వీట్ చేసి వక్ర బుద్ధి చూపించాడు.. ఇక దీంతో మళ్లీ మెగా – అల్లు కుటుంబాల మధ్య మాత్రమే కాదు అభిమానుల మధ్య కూడా వార్ మొదలైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిసారి గొడవలు మొదలవడానికి కారణం ఇద్దరు స్టార్ హీరోలు అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం..

మెగా ట్యాగ్ తొలగించడమే ప్రధానం..

ఇకపోతే మెగా ట్యాగ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయిన బన్నీ.. ఆ తర్వాత ఆ ట్యాగ్ ను తొలగించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉండాలని ఎవరి నీడ తనపై పడకూడదని.. మెగా బ్రాండ్ కి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో మెగా అభిమానులు మండిపడ్డారు.. మరొకవైపు ఒక మనసు సినిమా ఈవెంట్లో మెగా అభిమానులు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఉంటే.. బన్నీ ఫైర్ అయ్యారు.. వేరే హీరోల ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది.. ఇలా అరిస్తే ఎలా? అంటూ ప్రశ్నించాడు కూడా.. ఇక అప్పటినుంచి ఏ సినిమా ఈవెంట్లోనైనా అల్లు అర్జున్ మెగా హీరోల గురించి ప్రస్తావించలేదు.. ఇక అలవైకుంఠపురం సినిమా సమయంలో బన్నీపై తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది.

- Advertisement -

రామ్ చరణ్, అల్లు అర్జున్ వల్లే విభేదాలు..

అంతేకాకుండా చిరంజీవి పుట్టినరోజున ఎప్పటికో శుభాకాంక్షలు చెప్పడం కూడా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం పెరిగింది అనే విషయాన్ని స్పష్టం చేశాయి.. అంతే కాదు రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బయటకు రాని వివాదం ఏదో జరుగుతోందని సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఇప్పటికీ ఆ విషయంపై స్పష్టత లేదు.. మొత్తానికైతే అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలకు కారణం అల్లు అర్జున్ , రామ్ చరణ్ అంటూ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు