Allu Sirish : ఎట్టకేలకు ఏడాది తర్వాత మళ్ళీ ‘బడ్డి’ నుండి అప్డేట్..

Allu Sirish : అల్లు ఫ్యామిలీ నుండి ‘గౌరవం’గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు శిరీష్. అల్లు ఫ్యామిలి నుండి వచ్చాడన్నమాటే గాని సక్సెస్ మాత్రం కెరీర్ లో లేకుండా పోయింది. ఓ వైపు తన అన్న అల్లు అర్జున్‌ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు. కానీ అల్లు శిరీష్ మాత్రం తక్కువలో తక్కువ టాలీవుడ్ లో చిన్న హీరోగానూ ఎదగలేకపోయాడు. అప్పుడెప్పుడో శ్రీరస్తు శుభమస్తు అంటూ ఓ యావరేజ్ సక్సెస్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు. దానికి కూడా అల్లు శిరీష్ కి పెద్దగా క్రెడిట్ ఏమి లేదు. ఆ సినిమాలో ఏ హీరో ఉన్నా ఆడుతుంది అనేట్టుగా ఉంటుంది ఆ సినిమా. అందువల్ల శిరీష్ కి ఒరిగిందేమి లేదు. అయితే నటుడిగా కూడా ఏమాత్రం సక్సెస్‌ కాలేకపోతున్నాడు శిరీష్. తన కెరీర్‌ పరంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్‌ చేస్తూనే ఉన్నాడు. ఇక అల్లు శిరీష్ చివరగా `ఊర్వశివో రాక్షసివో` చిత్రంతో వచ్చాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. కమర్షియల్‌గా ఏమి ఆడలేదు.

బడ్డీ తో రీ ఎంట్రీ..

ఇక అల్లు శిరీష్ వరుస ప్లాపుల వల్ల రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్‌. తాజాగా “బడ్డీ” అనే చిత్రంతో అల్లు శిరీష్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది. దాదాపు ఏడాది కింద ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయింది. ఆ మధ్య రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ ఏమైందో మళ్ళీ ఈ సినిమా నుండి అప్డేట్స్ ఏమి రాలేవు. అనేక కారణాలతో వాయిదా పడింది. ఇక తాజాగా దదాపు పదకొండు నెలల తర్వాత ఈ సినిమా గురించి అప్డేట్ రావడంబడ్డీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ బడ్డీ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. త్వరలో ఓ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.

First single update from Allu Sirish movie 'Buddy'

- Advertisement -

బడ్డీ ప్రమోషన్స్ స్టార్ట్స్ ..

ఇక అల్లు శిరీష్ (Allu Sirish) నటిస్తున్న బడ్డీ మూవీ నుండి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. అందులో భాగంగా తాజాగా ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. ‘ఆ పిల్ల కనులే అంటూ సాగే పాటని రేపు విడుదల చేయబోతున్నారు. ఇక ఇందులో శిరీష్‌కి జోడీగా గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న `బడ్డీ` సినిమాకి హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు