Ramireddy: ఇండస్ట్రీనే షేక్ చేసిన విలన్..చివరికి ఇంత దారుణమైన పరిస్థితా..?

Ramireddy.. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రామిరెడ్డి.. ఈయన ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే కచ్చితంగా ప్రేక్షకుల విమర్శలు అందుకునేవాడు.. అంతలా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ప్రముఖ నటులు రామిరెడ్డి. తన విలనిజంతో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ.. తెరపై అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.. ఇక సినిమా జీవితంలో ఎంత ఉన్నతంగా బ్రతికారో జీవన విధానంలో మాత్రం చివరి క్షణాల్లో అన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు..

సమాజం కోసమే జర్నలిజం వైపు అడుగులు..

Ramireddy: The villain who shook the industry..in the end such a bad situation..?
Ramireddy: The villain who shook the industry..in the end such a bad situation..?

చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు.. నిజానికి రామిరెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువ.. సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న లక్ష్యంతోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ తీసుకున్నారు.. చదువు అనంతరం ‘ది మున్సిఫ్ డైలీ ‘ అనే దినపత్రికలో విలేఖరిగా చేరారు. ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా అందుకునే వరకు ఈయన విద్య మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.. దాంతో ఈయన ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా చాలామందికి తెలియదని చెప్పాలి. ఇక పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లోనే ఆయన మాట్లాడేవారు. అలాగే హిందీ , ఉర్దూ కూడా అనర్గళంగా మాట్లాడేవారు.

సినీ ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చిందంటే..

జనరల్ న్యూస్ కవర్ చేస్తూ సినిమా ఈవెంట్స్ ని కూడా కవర్ చేసేవారు రామిరెడ్డి .అందులో భాగంగానే కొంతమంది సినీ ప్రముఖులను కూడా ఇంటర్వ్యూ చేసిన ఈయన.. ఒకరోజు దర్శకుడు కోడి రామకృష్ణ కు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడగగ్గా.. ఆయన ఒక టైం చెప్పి రమ్మన్నారు.. డాక్టర్. రాజశేఖర్ కోడి రామకృష్ణ కాంబినేషన్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న అంకుశం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ గా నటించే ఆర్టిస్ట్ కోసం చిత్ర బృందం చూస్తోంది.. అదే సమయంలో ఇంటర్వ్యూ కోసం రామిరెడ్డి వెల్లగా.. లాల్చీ పైజామాతో నుదుటిన బొట్టుతో అక్కడికి వెళ్లిన రామిరెడ్డిని చూసి కోడి రామకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యారట .. తాను ఎలాంటి విలన్ కోసమైతే ఎదురు చూస్తున్నారో సరిగ్గా అలాంటి క్వాలిటీస్ తోనే రామిరెడ్డి ఎదురయ్యేసరికి ఆయన ఆశ్చర్యం చెందారు.. అప్పుడు ఇంటర్వ్యూ విషయం పక్కన పెట్టి.. నా సినిమాలో మెయిన్ విలన్ వేషం ఉంది చేస్తావా ? మంచి పేరు వస్తుంది.. అని కూడా అడిగారట కోడి రామకృష్ణ.. నాకు నటన రాదు సార్.. అసలు తెలియదు అని రామిరెడ్డి చెప్పినా.. అదంతా నేను చూసుకుంటాను.. నువ్వు చేస్తావా అని అడిగారట కోడి రామకృష్ణ..

- Advertisement -

డైరెక్టర్ ఇచ్చిన భరోసా ఉన్నత స్థాయికి చేర్చింది..

ఇక డైరెక్టర్ ఇచ్చిన భరోసాతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు రామిరెడ్డి.. అలా ఆ క్షణం ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది.. మొదటి సినిమా అయినా సరే క్రూరమైన విలన్ నీలకంఠంగా రామిరెడ్డి ప్రదర్శించిన నటన అందరిని భయపెట్టింది.. అంతేకాదు విలన్ అంటే ఇలాగే ఉండాలి అని పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ ఆలోచనలతో ఆయన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాదు రామిరెడ్డికి ఉన్నత స్థానాన్ని అందించింది.. తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజపురి భాషలో 260 చిత్రాలలో నటించారు..

క్యాన్సర్ బారినపడి మృతి..

ఇకపోతే ఏమాత్రం అనుభవం లేని ఫీల్డ్ లోకి వచ్చి బెస్ట్ విలన్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. మొదట లివర్ సమస్యగా మొదలై ఆ తర్వాత కిడ్నీ ఫంక్షన్ పై కూడా ప్రభావం చూపించింది. ఇక క్యాన్సర్ బారినపడి 2011 ఏప్రిల్ 14న 52 సంవత్సరాల వయసులో ఆయన స్వర్గస్తులయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు