Dakshina Trailer: తెలుగులో కబాలి హీరోయిన్ సైకో కిల్లర్ ట్రైలర్ అవుట్.. రిలీజ్ చేసిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ లో రజనీకాంత్ కూతురుగా తన నటనతో ప్రతి ఒక్కరిని మిస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్ భాషలో పాపులర్ అయింది సాయిధన్నిక. కబాలి క్రేజ్ టాలీవుడ్ లో పలు చిత్రాలు చేసింది. ఇక త్వరలో ఓ సైకో థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది.

దక్షిణ పేరుతో రూపొందిన ఈ మూవీ మంత్రం డైరెక్టర్ ఓషా తులసీరామ్ దర్శకత్వం వహించారు. దక్షిణ ట్రైలర్ను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు. మహిళను హత్య చేసి.. వారి తలలో స్థానంలో క్వశ్చన్ మార్క్ పెడుతున్న ఓ సైకో కిల్లర్ పాయింట్తో ట్రైలర్ ఇంట్రెస్టింగా మొదలైంది. ఈ ట్రైలర్ లో సీరియల్ మర్డర్స్ వెనుకున్న సీక్రెట్ ను రివిల్ చేసే పోలీస్ ఆఫీసర్గా.. నెగిటివ్ షేడ్స్ లో కూడిన రఫ్ లుక్ లో సాయిధన్నిక కనిపిస్తుంది.

Kabali Heroine Psycho Killer Trailer Out in Telugu
Kabali Heroine Psycho Killer Trailer Out in Telugu

ఆమె క్యారెక్టర్ లోని వేర్వేషన్స్ ఎంతో ఆసక్తిగా అనిపించాయి. టైలర్ రిలీజ్ అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో నన్ను ఎక్కువగా భయపెట్టింది దక్షిణ ట్రైలర్. తులసి రామ్ కు మంచి కం బ్యాక్ మూవీ గా సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న దక్షిణ మూవీ నిలవనుంది ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు