Dhanush: రాయన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే…?

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాయన్ మూవీపై అందరి ధ్యాస నెలకొంది. ఈ చిత్రం తనకి నటుడిగా 50వ మూవీ. అదేవిధంగా ధనుష్ కి దర్శకుడిగా ఇది రెండవ చిత్రం.

జూన్ 13, 2024న థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ కోసం ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ కి రెడీ అయినట్లు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. జూన్ 1, 2024న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

Rayan movie audio launch event date has arrived
Rayan movie audio launch event date has arrived

ఎస్జే సూర్య, సందీప్ కిషన్, కాలదాస్ జయరాం, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం ని సన్ పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు