Priyanka Jawalkar : సినిమాల్లేవ్ గాని.. ఫోజులకేం తక్కువగాదు!

టాలీవుడ్ లో టాలెంటెడ్ అమ్మాయిలకు కొదవలేదు అనేది ఎంత నిజమో, తెలుగమ్మాయిలకు ఛాన్సులు పెద్దగా రావు అనేది కూడా వాస్తవమే. ఇక్కడ పెర్ఫార్మన్స్ కన్నా గ్లామర్ షోస్ కే ఇంపార్టెన్స్ ఎక్కువ. అందుకే అంజలి లాంటి తెలుగు హీరోయిన్లకు అవకాశాలు వచ్చినా, వాళ్ళ టాలెంట్ చూపించినా పెద్దగా లాంగ్ టర్మ్ లో కెరీర్ కి యూస్ అవ్వడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో అనన్య నాగళ్ళ క్లిక్ అయినా ఆమె చిన్న సినిమాలకే పరిమితం అయింది. అయితే టాలీవుడ్ లో టాలెంట్ ఉండి, టాలీవుడ్ కి ఒక తెలుగు స్టార్ హీరోయిన్ రాబోతుంది అనిపించేలా చేసిన అమ్మాయి ప్రియాంక జవాల్కర్.

అనంతపూర్ కి చెందిన ఈ అమ్మాయి టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పైగా ఇప్పుడున్న తెలుగు హీరోయిన్లలో మంచి గ్లామర్ ఉన్న హీరోయిన్ ప్రియాంక. కానీ కాలం కలిసిరాకో లేక అదృష్టం తలుపుతట్టలేదో ఛాన్స్ లు మాత్రం రావట్లేదు. చివరగా మూడేళ్ళ కింద వచ్చిన ఎస్. ఆర్ కల్యాణ మండపం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు మళ్ళీ కనిపించని లేదు.

అయితే ప్రియాంక మాత్రం సోషల్ మీడియా లో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటుంది. పైగా గ్లామర్ షోకు కూడా తాను ఎప్పుడూ రెడీ అని ఫోటో షూట్ల ద్వారా చెప్తూ ఉంటుంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ గా ఎరుపు మెరూన్ కలర్ లో లంగా వోణి లో అచ్చ తెలుగమ్మాయిలా మారి సోషల్ మీడియా లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. మరి ఇప్పుడైనాఎవరైనా తెలుగు దర్శకుడు గాని, నిర్మాత గాని ఈ అమ్మాయికి అవకాశాలు ఇస్తాడేమో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు