Love Me Trailer : ప్రొమోషన్స్ మొదలెట్టారు

Love Me Trailer : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మిస్తూ దిల్ రాజు అంటే కేవలం నిర్మాత కాదు దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ అని ఇమేజ్ ను సంపాదించుకోగలిగాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధమైన చిన్నపాటి సమస్య వచ్చినా కూడా సినిమాలు పరంగా దానిని దిల్ రాజ్ దగ్గర ఉండి మరి క్లియర్ చేస్తారు. థియేటర్స్ విషయంలో కూడా దిల్ రాజ్ అందరికీ అడ్జస్ట్ చేసి సమన్వయం చేస్తారని ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఉంది.

ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఖ ఏమి ఆలోచించకుండా సినిమాకి వెళ్ళిపోవచ్చు అని డిసైడ్ అయ్యేవాళ్ళు. అంత అద్భుతమైన సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చేవి. ఆ బ్యానర్ లోనే ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ బ్యానర్ సినిమాలు తీయటంలో కొంచెం స్లో పేజ్ లో ఉంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్
ఇకపోతే దిల్ రాజ్ తన బ్యానర్ తో పాటు మరో బ్యానర్ ను నిర్మించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ అండ్ అన్షిత కొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా కమెడియన్ నుండి దర్శకుడుగా మారిన వేణుతో బలగం అనే ఒక సినిమాను చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ. ఇప్పుడు వీరు కూడా అద్భుతమైన సినిమాలు చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లానే దీనికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు.

- Advertisement -
Love Me Trailer Update
Love Me Trailer Update

మరో ఆర్య లాంటి కథ
ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై మరో సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు “లవ్ మీ” ఆ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ రివిల్ చేసే ఫంక్షన్ లో దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని అద్భుతమైన విషయాలను చెప్పాడు. ముందు ఈ కథను విన్నప్పుడు తను 20 ఏళ్ల కిందట విన్న ఆర్య కథ గుర్తొచ్చిందని, మళ్లీ ఈ కథ విన్నప్పుడు అదే ఫీల్ వచ్చిందని. అదే వైబ్ మళ్ళీ ఈ సినిమాతో పొందాను అని దిల్ రాజ్ ఈ సినిమా గురించి మరికొన్ని గొప్ప విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ను రీసెంట్గా ఒక వీడియోతో అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ రేపు సాయంత్రం 4:05 కు విడుదల కానుంది.

అయితే ఇది దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లో వస్తున్న రెండవ సినిమా కావడం విశేషం. ఎన్నోసార్లు దిల్ రాజ్ జడ్జిమెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద రుజువైంది. మరి ఈ సినిమా జడ్జిమెంట్ ఎంతవరకు రుజువుతుందో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు