Tamannah : తమన్నాకు ఇదేం పిచ్చి… అలాంటి పాత్రలపైనే ఆమె ఇంట్రెస్ట్ అంతా

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడున్న తమన్నా ఇంతకుముందు ఉన్న అమ్మాయి కాదు. గతంలో గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ ను ఓవర్ డోస్ తో వడ్డిస్తూ, ప్రేక్షకులకు అందాల విందు చేస్తోంది. తాజాగా తమన్నా “ఓదెల 2” అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించబోతోంది అనే విషయం అఫీషియల్ గా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమన్నాకు ఇదేం పిచ్చి? ఆమె ఇంట్రెస్ట్ అంతా అలాంటి పాత్రలపైనేనా? అంటే…

2016లో బిగ్ స్టేట్మెంట్
తమన్నాకు కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఆమె సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఏనాడూ హద్దులు దాటి స్క్రీన్ పై కనిపించలేదు. అయితే మోడరన్ లుక్ లో కనిపించడానికి, చిట్టి పొట్టి బట్టలు ధరించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. ఇక 2016లో ఏకంగా తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ లిప్ లాక్ సీన్లు చెయ్యను అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఆమెపై అభిమానులకు రెస్పెక్ట్, ఇష్టం మరింత పెరిగాయి. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలు చేసినప్పటికీ తమన్నా తన మాటను నిలబెట్టుకుంటూనే వచ్చింది. కానీ ఓటిటిలోకి వచ్చేసరికి రూల్స్ అన్నీ మార్చేసి, రెచ్చిపోయి మరీ నటిస్తోంది.

“జీ కర్దా”తో షో స్టార్ట్
2021లో “11th అవర్” అనే వెబ్ సిరీస్ తో ఓటిటి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. దీనితో పాటు ఆ తరువాత చేసిన “నవంబర్ స్టోరీ”లో కూడా కాస్త పద్ధతి గానే కనిపించింది. అయితే ఈ రెండు వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ దక్కలేదు. ఇలాగైతే ఫలితం లేదు అనుకుందో ఏమో గాని 2023లో రూల్స్ అన్నీ పక్కన పెట్టేసి, గ్లామర్ పరంగా హద్దులు దాటేసింది. వరుసగా “లస్ట్ స్టోరీస్ 2”, “జీ కర్దా”, “ఆఖరి సచ్” వంటి వెబ్ సిరీస్ లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేసింది. ఇందులో అప్పటిదాకా టచ్ చేయని ఇంటిమేట్ సీన్స్ ను చేసి అందరికీ షాక్ ఇచ్చింది తమన్నా. ఈ వెబ్ సిరీస్ లు రిలీజ్ అయిన తర్వాత తమన్నా ముద్దు సీన్లు, బెడ్రూమ్ సీన్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మీమ్స్ తో మొదలుకొని ట్రోల్స్ వరకు వాటిని వాడేసారు. ఆ తర్వాత కూడా తమన్నా ఎక్స్పోజింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగానే సాగింది. ఎక్కడ కనిపించినా తన పాలరాతి అందాల ప్రదర్శనతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. “జైలర్” సాంగ్ తో మరోసారి ట్రెండ్ అయ్యింది. ఇక ఇప్పుడేమో “ఓదెల 2″తో మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమాలో తమన్నా ఇంకెంత రెచ్చిపోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పాత్రలే ఎందుకు అంటే కాలం మారినప్పుడు తను కూడా మారాలి కదా అంటోంది ఈ సీనియర్ హీరోయిన్.

- Advertisement -

తమన్నా నెక్స్ట్ మూవీస్
ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. రెండు హిందీ మూవీస్, ఒక తమిళ మూవీ, మరో తెలుగు సినిమా చేస్తోంది. అందులో ఎక్కువగా సీక్వెల్సే ఉండడం విశేషం. తమిళంలో “అర్ణమనై 4”, హిందీలో వేద, స్త్రీ 2 సినిమాలు, తెలుగులో “ఓదెల 2” చిత్రాలతో బిజీగా ఉంది తమన్నా.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు