Mokshagna: స్టార్ హీరో కథతో మోక్షజ్ఞ.. రిస్క్ చేస్తున్నాడేమో..?

నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఎప్పటికప్పుడు ఈయన ఎంట్రీ గురించి వార్తలు రకరకాలుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. అంతే కాదు అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ కూడా తన లుక్స్ లో మార్పు తీసుకురావడంతో ప్రతి ఒక్కరు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మోక్షజ్ఞ ఎంట్రీ ఆ కథతోనే..
ఆదిత్య 369 సీక్వెల్ సిద్ధమవుతోంది.. ఆ మూవీలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు.. దర్శకత్వం కూడా నేనే చేయవచ్చు అంటూ బాలయ్య గతంలో చెప్పిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.. ఒక స్టార్ హీరో కోసం బోయపాటి శ్రీను రాసుకున్న కథతో మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నారట.. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని సమాచారం..

అల్లు అర్జున్ కథతో మోక్షజ్ఞ..
అయితే దర్శకుడు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసి చాలాకాలం అవుతోంది. ఇక అల్లు అర్జున్ కి ఉన్న కమిట్మెంట్ల కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.. ఈ క్రమంలోనే ఆ కథతో మోక్షజ్ఞ హీరోగా మూవీ చేయాలని బోయపాటి భావిస్తున్నారట. ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిన వెంటనే బోయపాటి శ్రీను – మోక్షజ్ఞ మూవీ సెట్స్ పైకి రానుందని సమాచారం.

- Advertisement -

రిస్క్ లో మోక్షజ్ఞ..
అయితే అల్లు అర్జున్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ మోక్షజ్ఞ కి సెట్ అవుతుందా.. అసలు డెబ్యూ మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు.. అప్పుడే ఇంత పెద్ద భారం మోక్షజ్ఞ మీద మోపడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అంటూ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇది కేవలం పుకారు మాత్రమే.. ఇంకా అధికారిక ప్రకటన వెలువబడలేదు.. మరి చూడాలి బాలయ్య తన వారసుడిని ఎలా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారో..

బాలయ్య సినిమాలు..
అఖండ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బాలయ్య గత ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే అఖండ -2 కూడా సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లు అన్నింటిని కొద్ది రోజులు పక్కనపెట్టి ఎలక్షన్లు పూర్తయిన వెంటనే ఈ సినిమాలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఏమైనా బాలకృష్ణ ఒకవైపు కొడుకు ఎంట్రీ కోసం అన్నీ సిద్ధం చేస్తూనే..మరొక వైపు తన కెరీర్ ని కూడా ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు