Ashish Vidyarthi : భాష రాకపోయినా డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్… సీక్రెట్స్ బయట పెట్టిన సీనియర్ నటుడు ఆశిష్

Ashish Vidyarthi : సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఆశిష్ విద్యార్థి కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో నెగిటివ్ రోల్స్‌లో కనిపించి క్రూరమైన విలన్ గా అలరించారు ఆశిష్. ఇప్పటికీ చాలామంది ఆయన పేరు కంటే మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో విలన్ అంటేనే  బాగా గుర్తుపడతారు. ఆ సినిమాలో ఇలియానాని వేధించే పోలీస్ ఆఫీసర్ గా నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రను అద్భుతంగా పోషించారు ఆశిష్ విద్యార్థి. అసలు తెలుగు చదవడం, మాట్లాడడం రాని ఆశిష్ విద్యార్థి డైలాగులు మాత్రం అద్భుతంగా చెప్పేస్తుంటాడు. తనకు రాని భాషలో అవలీలగా డైలాగులు చెప్పడం వెనక ఉన్న సీక్రెట్ ఏంటో తాజాగా బయట పెట్టేశారు ఆశిష్.

1991లో కాల్ సంధ్య అనే హిందీ సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు ఆశిష్. పాపే నా ప్రాణం అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పోకిరి సినిమాతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఇంకేముంది అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఛాన్సులు రావడంతో వెనక్కి తిరిగే చూసుకునే అవసరం లేకుండా దూసుకెళ్లారు ఈ సీనియర్ నటుడు. తాజాగా ఆశిష్ విద్యార్థి ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలుగు చదవడం, రాయడం మాట్లాడడం రాకపోయినా డైలాగులను మాత్రం అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్తున్నారో వివరించారు.

తాను డైలాగులను హిందీలో, ఇంగ్లీషులో అర్థం చేసుకుంటానని, ఆ తర్వాత హిందీలో ఎలా చెప్తానో మైండ్ లో అనుకుని తెలుగులో కూడా అలాగే చెప్తానని తన సీక్రెట్ ను బయటపెట్టారు. అయితే డైలాగులను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారా? అనే ప్రశ్నకు ఆశిష్ స్పందిస్తూ… అలాంటిదేమీ చేయనని, ఎందుకంటే సెట్స్ లో కొన్ని డైలాగ్ లను మార్చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు. అందుకే ఎక్కువగా మెంటల్ వర్క్ చేస్తానని, సెట్స్ లో ఉన్నప్పుడే ఆ డైలాగులను హిందీలో, ఇంగ్లీషులో రాసుకుని అర్థం చేసుకొని ఆ తర్వాత తనదైన శైలిలో చెప్తానని, అందుకే అంత పర్ఫెక్ట్ గా వస్తాయని వివరించారు. ఇక ఈ సీనియర్ నటుడికి ఎన్నో సౌత్ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు మాట్లాడడం రాదు కానీ, మాట్లాడితే అర్థం చేసుకుంటారు.

- Advertisement -

గత కొంతకాలం నుంచి ఆశిష్ కు ఆఫర్లు కరువయ్యాయి అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఆయన సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మనాభం సినిమాలో ఆయన తండ్రిగా కనిపించాడు. అలాగే రానా నాయుడు వెబ్ సిరీస్ లో కూడా ఓ పాత్రలో మెరిశాడు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎన్నో భాషల్లో సినిమాలు చేశానని గుర్తు చేశారు. విలన్ గానే కాకుండా ఇతర మంచి పాత్రలు కూడా చేశానని అయినప్పటికీ ఇప్పుడు కూడా తనను విలన్ గానే చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. నేను ఇతర పాత్రలు కూడా చేయగలను అంటూ ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే తను చేయడానికి రెడీగా ఉన్నాను అనే విషయాన్ని వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు