HBD Mohanbabu: మోహన్ బాబును డైలాగ్ కింగ్ గా నిలబెట్టిన చిత్రాలివే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా సరే పరకాయ ప్రవేశం చేసి తన డైలాగ్ లతో అందర్నీ ఆకట్టుకుంటూ కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించారు హీరో మోహన్ బాబు.. హీరోగా , విలన్ గా, కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ రోజున మోహన్ బాబు 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..

1). అసెంబ్లీ రౌడీ:
1992లో మోహన్ బాబు – దివ్యభారతి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి పరుచూరి మాటలు అందించగా.. నిర్మాతగా మోహన్ బాబు వ్యవహరించారు.. ఈ సినిమా మోహన్ బాబు కెరియర్ ని మలుపు తిప్పింది.

2). పెదరాయుడు:
మోహన్ బాబు సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో ఇది కూడా ఒకటి.. డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో అద్భుతంగా నటించారు.. సౌందర్య, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -

3). అల్లుడుగారు:
డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కి మంచి వినోదాన్ని ఇవ్వడమే కాకుండా మంచి మెసేజ్ ను కూడా అందించింది.. శోభన హీరోయిన్గా నటించింది.. ఇందులో మోహన్ బాబు నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

4). మేజర్ చంద్రకాంత్:
రాఘవేందర్ రావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది.ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రమ్యకృష్ణ ఇందులో నటించగా.. ఇందులో తండ్రి కొడుకుల మధ్య జరిగే సన్నివేశాలను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంతో మొదటిసారి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు..

5). శ్రీరాములయ్య:
1998లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది సూపర్ హిట్ గా నిలిచింది.. ఇందులో శ్రీహరి , నందమూరి హరికృష్ణ, సౌందర్య తదితర నటీనటులు నటించారు.

6). అల్లరి మొగుడు:
రమ్యకృష్ణ , మీనా, మోహన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ రాఘవేందర్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందించారు.

7). రౌడీ గారి పెళ్ళాం:
1991లో వచ్చిన ఈ సినిమా మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. హీరోయిన్గా శోభన నటించగా.. మోహన్ బాబు ఇందులో విభిన్నమైన పాత్రలతో మెప్పించారు.

8). బ్రహ్మ:
1992లో వచ్చిన ఈ సినిమా కూడా మోహన్ బాబు కెరీర్ ని మార్చేసింది.. బప్పిలహరి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

9). అడవిలో అన్న:
మోహన్ బాబు మరో విభిన్నమైన పాత్రలో అలరించిన చిత్రం అడవిలో అన్న.. ఈ చిత్రానికి డైరెక్టర్ వి గోపాల్ దర్శకత్వం వహించారు. ఇందులోని పాట వందనాలమ్మ అనే పాట ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

10). రాయలసీమ రామన్న చౌదరి:
2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా మోహన్ బాబు నటనను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది.. జయసుధ , చంద్రమోహన్ ఇతర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. ఇందులో మోహన్ బాబు నట విశ్వరూపాన్ని చూపించారు.

ఇవే కాకుండా పోస్ట్ మ్యాన్, అల్లరి పోలీస్ కుంతీపుత్రుడు, ధర్మ పోరాటం వంటి సినిమాలు కూడా మోహన్ బాబు కెరియర్ లో మంచి విజయాలను అందుకున్నాయి. అంతేకాదు ఈ చిత్రాలు ఎన్ని కూడా ఆయనను డైలాగ్ కింగ్ గా మార్చేశాయి..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు