Furiosa A Mad Max Saga : పిచ్చెక్కించే యాక్షన్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ కు ప్రీక్వెల్… కేన్స్ లో స్టాండింగ్ ఒవేషన్

Furiosa A Mad Max Saga : హాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎన్నో యాక్షన్ సినిమాలు తెరపైకి వచ్చాయి. అయితే అందులో ప్రత్యేకంగా నిలిచేది మాత్రం మ్యాడ్ మాక్స్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ లో అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్స్ తో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఇక తాజాగా మ్యాడ్ మ్యాక్స్ కు ప్రీక్వెల్ రాబోతోంది. ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా పేరుతో రూపొందుతున్న ఈ ప్రీక్వెల్ మే 23న థియేటర్లలోకి రాబోతోంది. అయితే తాజాగా ఈ విజువల్ వండర్ ను కేన్స్ లో ప్రదర్శించగా స్టాండింగ్ ఒవేషన్ లభించినట్టుగా తెలుస్తోంది.

కేన్స్ లో స్టాండింగ్ ఓవేషన్…

తాజాగా జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో హాలీవుడ్ మూవీ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాను ప్రదర్శించారు. అయితే ఈ మూవీకి ఏకంగా ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది అంటే ఫ్రీక్వెన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో చూసాక క్రిటిక్స్ తో పాటు హాలీవుడ్ వర్గాలు కూడా మేకర్స్ ను ప్రశంసలతో ముంచెత్తారని సమాచారం. దీంతో మ్యాడ్ మ్యాక్స్ మూవీ లవర్స్ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాను చూడడానికి వెయిట్ చేస్తున్నారు.

వేల కోట్ల బడ్జెట్…

ఈ మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించగా క్రిస్ హెమ్స్ వర్త్, అన్నా టైలర్ జాయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని దాదాపు 1400 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించినట్టు సమాచారం.

- Advertisement -

ఇక స్టోరీ విషయానికి వస్తే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి 15 నుంచి 20 ఏళ్ల ముందు ఫ్యూరియోసా కథ స్టార్ట్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రీక్వెల్ లో ఇమ్మోర్ట‌న్ జాయ్‌ ను ఎదిరించి ప్యూరియోస. డిమాంటస్ అనే ఇద్దరు బైకర్లు సాగించిన పోరాటం నేపథ్యంలో అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే అక్కడ రిలీజ్ అయ్యి రికార్డులు…

ఇప్పటికే ఈ మూవీ నార్త్ అమెరికాలో రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే 50 మిలియన్ల డాలర్ల వసూళ్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇండియాలో కూడా మ్యాడ్ మ్యాక్స్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉండడంతో ఈ మూవీ 100 కోట్ల మార్క్ ను ఈజీగా రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీకి ఇక్కడ పెద్దగా పోటీ కూడా లేకపోవడం విశేషం. ఇండియాలో ఈ తెలుగుతో పాటే ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది.

ఆరో పార్ట్ కూడా రెడీ..

మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లో ఇప్పటివరకు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 2015లో రిలీజ్ అయిన మ్యాడ్ మాక్స్ ప్యూరి రోడ్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ మూవీకి ఆరు ఆస్కార్ అవార్డులు రావడం విశేషం. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న ప్యూరియోసా ఐదో పార్ట్ కాగా, మ్యాడ్ మ్యాక్స్ ది వెస్ట్ ల్యాండ్ పేరుతో ఆరో పార్ట్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు