Jr NTR : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తారక్ వెళ్లడం లేదా?

Jr NTR : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడగా, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ భారీ మెజార్టీ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు ( జూన్12) న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద జరగనుండగా, ఈ బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార వేడుకలో చంద్రబాబు నాయుడుతో పాటు, పలువురు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక వేడుకకి తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ సినీ, ప్రముఖులతో పాటు దేశ నేతలు కూడా ఎంతో మంది హాజరుకానున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఈ వేడుకకి హాజరుకానున్నారు. అలాగే స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు అతిథిగా హాజరుకానున్నారు.

JR NTR will not attend Chandrababu Naidu's swearing-in ceremony

జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదా?

ఇక తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండగా, ఆయన కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అలాగే నందమూరి బాలకృష్ణ హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి, మూడోసారి అక్కడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించగా, పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రమాణ స్వీకార వేడుకలో పవన్ కూడా ఉంటారు. ఇక రాజకీయ నేపథ్యం ఉన్న సినీ హీరోలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణను మినహాయిస్తే… తెలుగు చిత్రసీమలో కొందరు హీరోలకు ఆహ్వానాలు అందాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి నటులకు ఆహ్వానాలు అందగా, రామ్ చరణ్ రేపు గేమ్ ఛేంజర్ షూటింగ్ నుండి నేరుగా ప్రమాణ స్వీకార వేడుకకు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాణ స్వీకార వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రావడం లేదని తాజా సమాచారం. తాజాగా అందిన సమాచారం ప్రకారం అసలు జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందలేదని టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

ఆహ్వానం అందలేదా? లేక మరేదైనా కారణమా?

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం అసలు జూనియర్ ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు వర్గం నుండి అసలు ఆహ్వానమే అందలేదని టాక్ వినిపిస్తుంది. అందుకే jr ఎన్టీఆర్ ప్రమాణ స్వీకార వేడుకకి రావడం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే మరో టాక్ ప్రకారం ఎన్టీఆర్ గోవా లో ‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల సీఎం ప్రమాణ స్వీకార వేడుకకి హాజరుకావడం లేదని వాదన వినిపిస్తుంది. మరి ఈ వాదనలో ఎంత నిజముందో తెలీదు గాని, మొన్ననే జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్ తో అందర్నీ కూల్ చేయగా, మళ్ళీ ఈ రచ్చ ఏంటో తేలిక నందమూరి అభిమానులు కంగారు పడుతున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు, కేంద్రంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇక వేదిక దగ్గర సుమారు 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు