Samantha: నాగచైతన్యను మర్చిపోలేకపోతున్న సమంత.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుని ఆ సినిమా అనంతరం స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

సమంత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 14 సంవత్సరాలపైనే అవుతుంది. ఇప్పటికీ వరుస సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా…. సమంత సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నాలుగేళ్ల పాటు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు.

విడాకులు తీసుకున్న తర్వాత సమంత కాస్త డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. హెల్త్ పరంగా, సినిమాలపరంగా కాస్త అంతరాయం కలిగింది. ఈ మధ్యనే మైయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత మళ్ళీ సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంత తన అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

- Advertisement -

Samantha: Still haunting.. Sam's emotions..!

ఈ క్రమంలోనే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికి సమంత నాగచైతన్యను మర్చిపోనట్టు తెలుస్తోంది. నాగచైతన్యకు సంబంధించిన కొన్ని గుర్తులు తన బెడ్ రూమ్ లో ఉన్నాయని తన క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు నాగచైతన్యతో మళ్ళీ కలవచ్చు కదా అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు