Saripodhaa Sanivaaram : మాస్ బీట్ తో నాని “గరం గరం” అప్డేట్…

Saripodhaa Sanivaaram : టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో నేచురల్ స్టార్ బ్లాక్‍బస్టర్స్ కొట్టాడు. ఇక ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో శనివారం మాత్రమే కోపాన్ని చూపించే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక నాని – వివేక్ కాంబోలో తెరకెక్కిన ‘అంటే సుందరానికి’ కమర్షియల్‍గా హిట్ కాకపోయినా, ఒక మంచి క్లాసిక్ సినిమాగా ప్రశంసలు పొందింది. ఇప్పటికీ ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అదే కాంబోలో సినిమా వస్తుంది కాబట్టి, సరిపోదా శనివారం పై క్రేజీ అంచనాలున్నాయి. ఇక ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుండగా, ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తప్ప మరే అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.

Saripodhaa Sanivaaram First song update

గరం.. గరం అంటూ.. ఫస్ట్ సాంగ్..

ఇక ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. చిత్ర యూనిట్ కాసేపటికిందే ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ చేయగా, ‘గరం.. గరం’ అంటూ ఈ పాట సాగుతుందని వెల్లడించింది. ఇక జూన్ 15వ తేదీన శనివారం ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఇక ఈ పాట డేట్‍ను టీమ్ ఇప్పటికే వెల్లడించగా.. ‘గరం గరం’ పేరుతో ఈ సాంగ్ రానుందని కాసేపటికింద అనౌన్స్ చేసింది. ఇక నాని సీరియస్‍ గా, ఇంటెన్స్‌గా చూస్తున్న ఓ పోస్టర్ నేడు రిలీజ్ చేసింది మూవీ టీమ్. జూన్ 15వ తేదీన గరం గరం సాంగ్ రానుందని వెల్లడించింది. “ఈ శనివారం కోసం గరం గరం సాంగ్‍ను సూర్య తీసుకొస్తున్నాడు. జూన్ 15న సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ సింగిల్ కోసం మీ వూఫర్లను రెడీ చేసుకోండి” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ నేడు ట్వీట్ చేసింది. ఇక ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇక జేక్స్ తెలుగులో ఇప్పటికే ట్యాక్సీ వాలా, చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్, ఒకే ఒక జీవితం చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశాడు.

- Advertisement -

సాలిడ్ క్రేజ్ తో సరిపోదా శనివారం..

ఇక టాలీవుడ్ లో సరిపోదా శనివారం చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు కామెడీ చిత్రాలనే చేసి మెప్పించిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్తిల్లర్‌గా ఈ మూవీని రూపొందిస్తుండటంతో చాలా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌లో నాని లుక్ అదిరిపోయింది. శనివారమే కోపం అనే కాన్సెప్స్ కూడా డిఫరెంట్‍గా ఉంది. ఇక సరిపోదా శనివారం మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తుండగా, గ్యాంగ్ లీడర్ చిత్రం తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతోంది. సరిపోదా శనివారం మూవీలో ఎస్‍జే సూర్య, సాయికుమార్ వంటి విలక్షణ నటులు కీలకపాత్రలు చేస్తున్నారు. ఇక సరిపోదా శనివారం మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుండగా, తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక సరిపోదా శనివారం తర్వాత నాని దసరా లాంటి బ్లాక్‍బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీకి నాని ఓకే చెప్పారు. అలాగే దర్శకుడు సుజీత్‍ తో ఓ చిత్రానికి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, భారీ బడ్జెట్ అవుతుందనే కారణాల వల్ల ఈ మూవీని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాలని భావిస్తున్నట్టు రూమర్లు రాగా, అలాగే బలగం డైరెక్టర్ వేణుతో నాని.. ఎల్లమ్మ చిత్రం కూడా లైన్లో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు