Sikandar Update : ఇద్దరు హీరోయిన్స్, ముగ్గురు విలన్స్, ఏమి ప్లాన్ చేసావ్ మురగా.?

Sikandar Update: దర్శకుడు ఏఆర్ మురగదాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు. సినిమాలను కమర్షియల్ గా తెరకెక్కించడం మాత్రమే కాకుండా ఆయా సినిమాల ద్వారా ఒక మెసేజ్ కూడా ఇస్తూ ఉంటాడు. తమిళ్లో సినిమాలు తెరకెక్కించే మురగదాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. ఇకపోతే మురగదాస్ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. వాటిని తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆదరించారు.

స్టాలిన్ సినిమాతో తెలుగు దర్శకత్వం

సూర్య హీరోగా నటించిన గజినీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. సూర్య కెరియర్ లోని ఇది ఒక బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. సూర్య నటించిన తీరు మురగదాస్ ఆ సినిమాను తెరకెక్కించిన విధానం ఇవన్నీ కూడా ఆడియన్స్ ని విపరీతంగా కట్టి పడేసాయి. ఆ తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఠాగూర్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను ఏ ఆర్ మురగదాస్ రమణ పేరుతో ఒరిజినల్గా తెరకెక్కించారు. ఆ సినిమాకి రీమేక్ గా ఠాగూర్ సినిమా తెలుగులో వచ్చింది. అలానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ అనే సినిమాను కూడా మురగదాస్ తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కానీ ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ ఫ్రీడం మురగదాస్ కి ఇవ్వలేదు అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత చాలా కాలం పాటు తెలుగులో డైరెక్షన్ చేయలేదు మురగదాస్.

Salman Khan

- Advertisement -

సికిందర్ సినిమా కోసం ముంబైలో షూట్

మహేష్ బాబు హీరోగా చేసిన స్పైడర్ సినిమాతో మళ్లీ తెలుగులో దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇకపోతే మధ్యలో మురగదాస్ చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అందులో తుపాకీ, దర్బార్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలు షూటింగ్ ముంబైలో చేశాడు మురగదాస్. ఇప్పుడు మరో సినిమా కోసం ముంబైలో మళ్ళీ షూటింగ్ చేయనున్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ అనే సినిమాను మురగదాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ముంబైలో షూట్ చేయనున్నాడట మురగదాస్. ఈ సినిమాల్లో రష్మిక మందన కరీనాకపూర్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. అలానే ఈ సినిమాలు ముగ్గురు విలన్స్ ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు