Kalki2898AD : కల్కి2898AD ట్రైలర్ 24 గంటల రిపోర్ట్..బాగానే ఉన్నా.. ఊహించినంత రాలేదు?

Kalki2898AD : సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ “క‌ల్కి 2898 AD” ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు నిన్న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రియాంకా దత్, స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించడం జరిగింది. ఇక ఈ విజువల్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నిమిషాల్లో లక్షల్లో లైక్స్, గంటల్లో మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డుల పరంగా కొత్త రికార్డులు సెట్ చేస్తుంది అనుకున్నారందరూ. రెస్పాన్స్ అయితే సాలిడ్ గా వచ్చింది గాని, అందరూ అనుకున్న రికార్డులు మాత్రం మిస్ అయింది కల్కి ట్రైలర్. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన మొదట్లోనే 100k రికార్డ్ మిస్ అయిన కల్కి ట్రైలర్ తాజాగా 24 గంటలు పూర్తి చేసుకుంది.

Kalki2898AD Trailer 24 Hours Report

24 గంటల రెస్పాన్స్ ఇలా ఉంది..

ఇక ప్రభాస్ నటించిన కల్కి2898AD (Kalki2898AD) మూవీ ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయితే ఆ ట్రైలర్స్ సాధించే రికార్డులలో ముందుగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను అందుకుంటుంది అనుకోగా, 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయి 24 గంటలు పూర్తి చేసుకోగా, ఈ ఒక్కరోజు లో కల్కి ట్రైలర్ 14.43 మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా, 694k లైక్స్ దక్కించుకుంది. రెస్పాన్స్ పరంగా చాలా బాగానే వచ్చినా రికార్డులు అందుకోవడంలో మిస్ అయింది. ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ట్రైలర్ పరంగా RRR 1.24m లైక్స్ తో టాప్ లో ఉండగా, వ్యూస్ పరంగా గుంటూరు కారం 37.67m వ్యూస్ తో టాప్ లో ఉంది. ఇక కల్కి ఈ రికార్డుల విషయంలో టాప్ 10 లో కూడా లేకపోవడం గమనార్హం.

- Advertisement -

ఓవరాల్ గా సూపర్ రెస్పాన్స్..

ఇక కల్కి2898AD ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో అన్ని భాషల్లో కలిపి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. కానీ సింగల్ లాంగ్వేజ్ పరంగా డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. బహుశా అన్ని భాషలకు కలిపి ఒకే ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే సూపర్ రెస్పాన్స్ వచ్చేది. ఇక అప్ కమింగ్ టైంలో వరుస పెట్టి టాప్ స్టార్ మూవీస్ రిలీజ్ కానున్నాయి కాబట్టి యూట్యూబ్ రికార్డుల లిస్టులో వచ్చే సినిమాలు ఏవో చూడాలి ఇక. దేవర, గేమ్ ఛేంజర్, పుష్ప2 ఇందులో ఏవైనా లెక్కలు సెట్ చేయొచ్చు. ఇక కల్కి ట్రైలర్ లో అన్నిటికంటే బెస్ట్ గా VFX సీన్స్ ఉండగా, ప్రభాస్ తో సహా ఇందులో అందర్నీ ఓ రేంజ్ లో చూపించారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. అలాగే క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌ను ఎవ‌రూ ఊహించ‌ని గెట‌ప్ తో తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమాను జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయనుండగా ఇప్పటికే ప్రమోషన్లు పీక్స్ కి చేరాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు