Nbk: పవన్ కళ్యాణ్ దర్శకుడుతో బాలయ్య సినిమా

Nbk: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శకులను హరీష్ శంకర్ ఒకరు. షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత మళ్లీ రవితేజ హీరోగా మిరపకాయ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. ఈ సినిమాతో దర్శకుడుగా నిలబడ్డాడు హరీష్ శంకర్. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా ఈ సినిమా కొల్లగొట్టింది.

Gabbar Singh

గబ్బర్ సింగ్ సినిమాతో రేంజ్ మారింది

గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు హరీష్ శంకర్. హరీష్ ఎన్ని సినిమాలు చేసినా కూడా హరీష్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అంటే గబ్బర్ సింగ్ అని చెబుతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలి అనుకుంటారు అలా చూపించి బాక్సాఫీస్ వద్ద 100% సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత హరీష్ కెరియర్ కి తిరుగులేకుండా పోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్ వరుణ్ తేజ్ అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేశాడు. అయితే ఒక రీమిక్ సినిమాను కూడా తనదైన స్టైల్ లో అద్భుతంగా డీల్ చేస్తాడు హరీష్.

- Advertisement -

హరీష్ దర్శకత్వంలో బాలయ్య

ఇకపోతే హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇకపోతే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఉన్న రాజకీయ పరిస్థితుల వలన కొంతకాలం గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం హరి శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణతో హరీష్ శంకర్ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. ఇక నిన్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి క్లారిటీ వచ్చింది. బాలకృష్ణతో హరీష్ దిగిన ఫోటోలు షేర్ చేసి విషెస్ తెలిపారు. దీంతో హరీష్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని చాలా మంది కన్ఫామ్ చేసేసుకున్నారు. దీనిపై అధికార ప్రకటన అయితే రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు