Kalki2898ADTrailer: కల్కి ట్రైలర్ పై సీతారామం దర్శకుడు రెస్పాన్స్

Kalki2898ADTrailer: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా పాన్ ఇండియా అరేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్నారు. సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాలుగు భాగాలుగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదటి పార్ట్ లో కేవలం 20 నిమిషాలు మాత్రమే కమలహాసన్ కనిపిస్తారట. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు.

Kalki 2898 AD

కల్కి సినిమా ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని ఇప్పటికే చాలామంది ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ కూడా సినిమా పైన అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పొచ్చు. ట్రైలర్ లో ప్రతి క్యారెక్టర్ ని కూడా రివీల్ చేస్తూ క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్వని దత్ భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఓకే ఈ బ్యానర్ లో చివరగా వచ్చిన సినిమా సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. మంచి కలెక్షన్స్ సాధించడంతోపాటు విమర్శల ప్రశంసలను కూడా ఈ సినిమా అందుకుంది. అయితే ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి కల్కి సినిమా ట్రైలర్ పైన ప్రశంసలు కురిపించాడు. కల్కి సినిమా ట్రైలర్ టెరిఫిక్ గా ఉంది అంటూ, ప్రభాస్ భైరవ క్యారెక్టర్ లో అవుట్ స్టాండింగ్ ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమా గురించి తనంతగా ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు