Nithya Menon: ఆ యంగ్ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉంటున్న నిత్యామీనన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు హీరోయిన్ల కంటే… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు మన తెలుగులో బాగా పాపులర్ అవుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. అయితే ఆ అవకాశాలను కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే సద్వినియోగం చేసుకొని సక్సెస్ అవుతూ ఉంటారు.

అలా అవకాశాలను అందిపుచ్చుకొని… దూసుకెళ్తున్న వారిలో హీరోయిన్ నిత్యామీనన్ ఒకరు. హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ కాస్త లావుగా ఉన్న… చాలా అందంగా ఉంటుంది. ముఖంలో లక్ష్మి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ అందమే ఆమె సినిమాలకు బాగా ప్లేస్ అవుతున్నాయి. అలా మొదలైంది సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ… తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

Happy Birthday Nithya Menon - Few Crazy Facts About This Actress
Nithya Menon

తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ అలాగే మలయాళం లాంగ్వేజ్ లో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ఇక్కడ చాన్సులు వచ్చినా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. బెంగళూరు నగరానికి చెందిన నిత్యామీనన్…. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. ఇక తెలుగులో.. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భీమ్లా నాయక్, సన్నాఫ్ సత్యమూర్తి ఇలాంటి ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అందుకోవడం జరిగింది.

- Advertisement -

అయితే 36 సంవత్సరాలు ఉన్న హీరోయిన్ నిత్యమీనన్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళం ఇండస్ట్రీలో ఉన్న ఓ యంగ్ డైరెక్టర్ తో… హీరోయిన్ నిత్యామీనన్ కాస్త క్లోజ్ గా ఉంటుందట. దీంతో వారి మధ్య ఎఫైర్ ఉందని.. మలయాళ ఇండస్ట్రీ సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే… తమ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని… అందులో ఎలాంటి వాస్తవం లేదని నిత్యామీనన్ కూడా క్లారిటీ ఇచ్చిందట. కానీ నిత్యామీనన్ గురించి ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు