Bhagyashri Borse: దుల్కర్ సరసన నటించనున్న రవితేజ హిరోయిన్

Bhagyashri Borse: దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. దుల్కర్ మలయాళం లో చేసిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. మలయాళం సినిమాలు చూసి దుల్కర్ కి ఫ్యాన్ అయిన తెలుగు ఆడియన్స్ కూడా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగులో సీతారామం అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులుకు కూడా దగ్గర పోయాడు. అంతకుముందు మహానటితో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఇంట్లో ఒకడైపోయాడు.

ఇకపోతే దుల్కర్ ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో నేరుగా సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. అలానే దుల్కర్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్ అనే సినిమాను చేస్తున్నాడు దుల్కర్. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే అదే డేట్ నా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా వస్తే ఈ సినిమా వెనక్కు తగ్గుతుంది. ఒకవేళ ఓజి సినిమా రాకపోతే ఆ ప్లేస్ లో ఈ సినిమాని ప్లాన్ చేశాడు సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ.

Bhagyashri Borse

- Advertisement -

దుల్కర్ తన తదుపరి సినిమాను తెలుగులో చేయనున్నాడు. ఈ సినిమాతో రవి అనే కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఆ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా అంతా ఒక అమెరికా బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు