Chandhini Chowdary: NBK109 లో స్ట్రాంగ్ ఉమెన్ గా ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాను

Chandhini Chowdary: షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకుంది చాందిని చౌదరి. చాందిని చౌదరి చేసిన చాలా షార్ట్ ఫిలిమ్స్ మంచి రెస్పాన్స్ సాధించాయి. ఫణీంద్ర తీసిన మధురం షార్ట్ ఫిలిం చాందిని చౌదరి కెరీర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆ తర్వాత ఫణీంద్ర తీసిన మను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మను సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా మంచి ప్రశంసలను అందుకుంది.

మను సినిమా తర్వాత చాందిని చౌదరికి వరుసగా సినిమాలు వచ్చాయి అయితే కానీ ప్రాపర్ హిట్ అంటూ ఇప్పటివరకు పడలేదు అని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన గామి సినిమా పరవాలేదు అనిపించుకుంది. తెలుగు హీరోయిన్స్ చాలామంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అయితే వారందరూ కొంతకాలం మాత్రమే నటించి తర్వాత కనుమరుగైపోయారు. కానీ చాందిని చౌదరి మాత్రం బీభత్సమైన హిట్ సినిమాలు పొందుకోకపోయినా కూడా ఇప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది.

Chandini Chowdary

- Advertisement -

ఇక కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఒక మంచి పాత్ర, మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికితే వాటిని కూడా చేయడంలో వెనకాడకుండా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో చాందిని చౌదరి కనిపించబోతున్నట్లు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే పెద్ద హీరో ఉన్న సినిమాలో చేయటం ఇదే మొదటిసారి, నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబి గారికి థాంక్యూ అంటూ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక చాందిని చౌదరి నటించిన ఏవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు