Ninda: నిందా మూవీ ని డిస్ట్రిబ్యూట్ చేయనున్న ప్రముఖ సంస్థ..!

Ninda: వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ నింద. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ముగించుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. యుదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను రాజేష్ డైరెక్ట్ చేశారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ అండ్ టీజర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది.

కాగా ఈ మూవీ ని నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చెయ్యనుంది. ఇక ఈ మేరకు వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.

Famous company to distribute Ninda movie
Famous company to distribute Ninda movie

మైత్రి సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేస్తుందంటే ఈ చిత్రంలో కచ్చితంగా కంటెంట్ ఉండే ఉంటుందని ప్రేక్షకులు నమ్మకం పెడుతున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలదో లేదో చూడాలి. ఇక ఈ చిత్రం జూన్ 21న థియేటర్లలో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకి రానుంది. చాలాకాలం గ్యాప్ తరువాత వరుణ్ సందేశ్ చేసిన తొలి సినిమా ఇది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతలాగా ఆకట్టుకోగలదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు