Kalki2898AD : ఓవర్సీస్ లో అల్ టైం రికార్డులపై గురి? ప్రీమియర్స్ రికార్డ్ బ్రేక్ అయ్యేనా?

Kalki2898AD : టాలీవుడ్ తో సహా పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెండేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు పెద్దగా అంచనాలు లేకపోయినా, టీజర్, ట్రైలర్స్ తో పిచ్చెక్కించే హైప్ ని సొంతం చేసుకుంది. ఇక నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ట్రైలర్ తో అన్ని భాషల్లోనూ ఒక్క సారిగా విపరీతమైన బజ్ ని సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఇతర భాషల్లో కల్కి ని ప్రమోట్ చేయట్లేదని ఫ్యాన్స్ నిరాశ పడగా, ప్రమోషన్లు మొదలుపెట్టకుండా ఒక్క ట్రైలర్ తోనే అన్ని భాషల్లో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ముఖ్యంగా హిందీలో కల్కి కోసం ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చూసాక బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ పక్కాగా చెప్తున్నారు. ఇదిలా ఉండగా కల్కి రికార్డులు ఓవర్సీస్ నుండే మొదలుపెట్టనున్నట్టు, అక్కడే మొదట ఫోకస్ చేసినట్టు లెక్కలు చెప్తున్నాయి.

Kalki2898AD movie focused on all time records in overseas

ఓవర్సీస్ లో అల్ టైం రికార్డులపై గురి?

ఇక ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ లో సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా సినిమాకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ ఏడాది హనుమాన్ ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న కల్కి2898AD ఓవర్సీస్ లో అల్ టైం రికార్డులపై కన్నేసినట్టు తెలుస్తుంది. అయితే ఓవర్సీస్ లో వ్యక్తిగతంగా చూసుకుంటే రాజమౌళి సినిమాలకి మాత్రమే ఓవర్సీస్ లో 3 మిలియన్స్ డాలర్స్ కి పైగా ప్రీమియర్ షోల మార్కెట్ ఉంది. హీరోల పరంగా చూసుకుంటే ఆ స్థాయిలో మార్కెట్ ఉన్న ఒకే ఒక్క నటుడు డార్లింగ్ ప్రభాస్. ఇతర హీరోలకు 1.5 మిలియన్ డాలర్స్ వరకే ప్రీమియర్ షోల మార్కెట్ ఉండగా, ప్రభాస్ కి మాత్రమే 2.5 నుంచి 3 మిలియన్ డాలర్స్ ప్రీమియర్ షోల మార్కెట్ ఉంది. నార్త్ అమెరికాలో ఇండియన్ సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది. సలార్ మూవీ ప్రీమియర్ షోలతోనే ఏకంగా 2.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ షోల ద్వారా 3.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది. అయితే ఇప్పుడు ప్రభాస్ నటించిన “కల్కి2898ఏడీ” మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుని RRR ప్రీమియర్స్ రికార్డ్ బ్రేక్ చేయాలనీ చూస్తుంది.

- Advertisement -

ఆల్రెడీ మొదలైన బుకింగ్స్.. హాఫ్ మిలియన్స్ ఔట్..

ఇక కల్కి2898AD (Kalki2898AD) సినిమాకి సంబందించి ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రాంతాలలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక కల్కి సినిమా రిలీజ్ టైం వచ్చేసరికి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల బుకింగ్స్ ద్వారానే 3 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని మొదటి రోజు కల్కి 2898ఏడీ అల్ టైం రికార్డ్స్ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దాదాపు ప్రీమియర్స్ తో కలిపి కల్కి ఫస్ట్ డే 5 మిలియన్ల డాలర్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టు టికెట్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు తాజాగా బయటికి రాగా, ఇప్పటికే $524K డాలర్స్ వచ్చాయని సమాచారం. మరి రిలీజ్ డేట్ దగ్గరయ్యే వరకు ఓవర్సీస్ బుకింగ్స్ లో రోజుకో నంబర్ మారుతుంది. ఇక ఇండియాలోనూ భారీ రికార్డులు ఓపెనింగ్స్ తోనే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు