Kalki2898AD : రికార్డు మిస్ అయిన కల్కి.. ఫాస్టెస్ట్ 100k లైక్స్ లో ప్లేస్ లో అంటే!

Kalki2898AD : సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ “క‌ల్కి 2898 AD” ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు నిన్న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రియాంకా దత్, స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించడం జరిగింది. ఇక ఈ విజువల్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నిమిషాల్లో లక్షల్లో లైక్స్, గంటల్లో మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డుల పరంగా కొత్త రికార్డులు సెట్ చేస్తుంది అనుకున్నారందరూ. రికార్డులయితే సెట్ చేస్తుంది, కానీ అందరూ అనుకున్న రికార్డులు మాత్రం మిస్ అయింది కల్కి ట్రైలర్. అదేంటో చూద్దాం.

Kalki2898AD just missed the fastest 100k likes record

ఫాస్టెస్ట్ 100k జస్ట్ మిస్..

టాలీవుడ్ లో ఈ ఏడాది మహేష్ బాబు గుంటూరు కారం వచ్చిన ఆల్ మోస్ట్ 6 నెలల తర్వాత ఇప్పుడు ఒక బడా స్టార్ హీరో సినిమా వస్తుంది. ప్రభాస్ నటించిన కల్కి2898AD (Kalki2898AD) మూవీ ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయితే ఆ ట్రైలర్స్ సాధించే రికార్డులలో ముందుగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను ఎంత త్వరగా అందుకుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కాగా లేటెస్ట్ గా వచ్చిన కల్కి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను అందుకుంటుంది అనుకున్నా, టాప్ 4 ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ కి ట్రైలర్ ప్రీమియర్స్ లైక్స్ తో కలిపి 7 నిమిషాల టైంకి 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకుంది.

- Advertisement -

ఒకసారి టాలీవుడ్ ట్రైలర్స్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న ట్రైలర్ లను గమనిస్తే…

సలార్ – 3mins
భీమ్లా నాయక్ – 4mins
వకీల్ సాబ్ – 7 mins
కల్కి2898AD – 7 mins ***
RRR – 8 mins
సర్కారు వారి పాట – 9 mins
అది పురుష్ – 9 mins
గుంటూర్ కారం – 15 mins
పుష్ప – 19mins
బ్రో – 21mins
సాహో 27mins
రాధేశ్యామ్ – 27mins
వాల్తేరు వీరయ్య – 30mins

24 గంటల రికార్డు వస్తుందా?

ఇక మొత్తం మీద ప్రభాస్ పేరిటే ఇప్పటికీ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డ్ సలార్ సినిమాతో ఉన్నప్పటికీ కల్కి కూడా ఆ రేంజ్ లో దుమ్ము లేపుతుంది అనుకున్నారు అందరు. కానీ కుదరలేదు. ఇక రీజనల్ మూవీస్ తోనే పవర్ స్టార్ 2 సినిమాలతో మాస్ రచ్చ చేశాడు. ఇక అప్ కమింగ్ టైంలో వరుస పెట్టి టాప్ స్టార్ మూవీస్ రిలీజ్ కానున్నాయి కాబట్టి లిస్టులో వచ్చే సినిమాలు ఏవో చూడాలి ఇక. దేవర, గేమ్ ఛేంజర్, పుష్ప2 ఇందులో ఏవైనా లెక్కలు సెట్ చేయొచ్చు. ఇక కల్కి2898AD ట్రైలర్ 24 గంటల్లో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక కల్కి ట్రైలర్ లో అన్నిటికంటే బెస్ట్ గా VFX సీన్స్ ఉండగా, ప్రభాస్ తో సహా ఇందులో అందర్నీ ఓ రేంజ్ లో చూపించారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. అలాగే క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌ను ఎవ‌రూ ఊహించ‌ని గెట‌ప్ తో తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమాను జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయనుండగా, క‌ల్కి మూవీ ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు