#BB4 : బాలయ్య బోయపాటి సినిమా ఓపెనింగ్ వేదిక మారిందా?

#BB4 : నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్నికల హడావిడి వల్ల షూటింగ్ లు ఆపేయగా, జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక రేపు బాలకృష్ణ ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేయనుండగా, ఈ పనులు ముగిసిపోగానే తన సినిమాల షూటింగ్ లపై ఫోకస్ చేయనున్నారు. ఇక నిన్న (జూన్10) న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా తన రాబోయే సినిమా అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఎప్పట్నుంచో అఖండ సీక్వెల్ కూడా వచ్చేస్తుందన్న వార్తలు నెట్టింట ట్రెండ్ అవగా, నిన్న అధికారికంగా ప్రకటించేసారు. #BB4 పేరిట బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమాని ప్రకటించారు. ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో మూడేళ్ళ కింద వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస పరాజయాల్లో ఉన్న బాలకృష్ణ కి భారీ సక్సెస్ ని అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అఖండ కి సీక్వెల్ అనౌన్స్ మెంట్ తో బాలయ్య అభిమానుల్లో మరింత జోష్ వచ్చింది.

#BB4 movie opening ceremony in Amaravati

#BB4 ఓపెనింగ్ వేదిక మారిందా?

ఇక బాలకృష్ణ నుంచి ఉన్న సాలిడ్ లైనప్ లో ఎగ్జైటింగ్ గా ఉన్న చిత్రం “అఖండ” సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తుండగా, ఈ సినిమా ప్రారంభోత్సవం బాలయ్య అడ్డా, తాను ఎమ్మెల్యేగా నెగ్గిన “హిందూపురం” లోనే ప్రారంభం కానున్నట్టుగా నిన్నటివరకు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వేదిక మారిందని సమాచారం. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం బాలయ్య బోయపాటి సినిమా ఓపెనింగ్ వేడుక ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. బాలయ్య ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ప్రారంభోత్సవ వేడుకని గ్రాండ్ గా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక బోయపాటి శ్రీను ఈ సీక్వెల్ పై కూడా సాలిడ్ ప్లానింగ్ లనే చేస్తున్నారని చెప్పాలి. రీసెంట్ గా టిడిపి లో కొన్ని ప్రతిష్టాత్మకమైన బాధ్యతలను బోయపాటిశ్రీనుకి చంద్రబాబు అప్పగించడం జరిగింది. ఆ పనుల్లో ఉన్న బోయపాటి అతి త్వరలోనే #BB4 ని ప్రారంభించనున్నారు. ఇక ఈ భారీ సినిమాపై అధికారికంగా మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.

- Advertisement -

బాబీ సినిమా పూర్తి కాగానే #BB4

ఇక ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో బాలయ్య కెరీర్ లో 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా, లేటెస్ట్ గా బాలయ్య బర్త్ డే కి మరో చిన్న గ్లిమ్ప్స్ ని వదిలారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తవగా, త్వరలో మిగతా భాగాన్ని పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య #BB4 ప్రాజెక్ట్ ని మొదలుపెట్టనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు