Kalki2898AD : ఒక్క షాట్ తో అందరి ఫోకస్ కమల్ పై.. నుదిటి మీద గాటుతో?

Kalki2898AD : ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ “క‌ల్కి 2898 AD” ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రియాంకా దత్, స్వప్న దత్ నిర్మించగా, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అవగా, కాసేపటికిందే యూట్యూబ్ లో రిలీజ్ అయిన కల్కి ట్రైలర్ నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ అభిమానుల అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా హాలీవుడ్ రేంజ్ లో కల్కి ట్రైల‌ర్ క‌ట్ ఉండ‌టంతో ప్రేక్ష‌కులు కల్కి యుఫోరియాతో ఊగిపోతున్నారు. ఇక ఈ ట్రైలర్ లో ఓ అమ్మాయి కోసం అశ్వధ్ధామ అండగా (అమితాబ్ బ‌చ్చ‌న్) చేసే పోరాటానికి, భైర‌వ (ప్ర‌భాస్) అడ్డుగా వెళ్తాడు. అటుపై ఏం జ‌రిగింద‌నేది కథగా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అన్నిటికంటే బెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది VFX సీన్స్. ప్రభాస్ తో సహా ఇందులో అందర్నీ ఓ రేంజ్ లో పవర్ ఫుల్ గా చూపించారు మేకర్స్.

Kamal Haasan in stunning makeover in Kalki2898AD trailer

ఒక్క షాట్ తో అందరి చూపును తనవైపు తిప్పుకున్న కమల్..

ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఉలగనయగన్ క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌ను ఎవ‌రూ ఊహించ‌ని గెట‌ప్ తో తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ట్రైలర్ మొత్తంలో ప్రభాస్ ని, అమితాబ్ ని అదిరిపోయే యాక్షన్ సీన్లతో చూపించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ట్రైలర్ చివర్లో కమల్ హాసన్ ని ఒకే ఒక్క షాట్ లో చూపించి కమల్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చాడు. ట్రైలర్ రిలీజ్ కి ముందు కూడా అందరిలో కమల్ హాసన్ మేకోవర్ పై ఆసక్తి నెలకొంది. ఇక అందరి అంచనాలని మించి కమల్ హాసన్ తన ఓల్డ్ గెటప్ తో కనిపించి అందరిని స్టన్ చేశారు. ఇక కమల్ హాసన్ ట్రైలర్ చివర్లో “భయపడకు మరో ప్రపంచం వస్తుంది” అంటూ చెప్పిన ఫినిషింగ్ డైలాగ్ అదిరిపోయింది. అలాగే కమల్ హాసన్ ఇందులో ఒక ముసలి గెటప్ లో నుదుటిపైన మెరుస్తున్న గాటుతో కనిపించారు. అయితే ఇలా గాటుతో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్స్ హాలీవుడ్ లో హ్యారీ పోటర్ లాంటి చిత్రాల్లో కామన్ గా కనిపిస్తూ ఉంటారు. మరి కమల్ హాసన్ రోల్ ఏ రేంజ్ లో చుపిస్తున్నారో చూడాలి.

- Advertisement -

జున్ 27న రికార్డు లెవెల్లో రిలీజ్..

ఇక కల్కి2898AD (Kalki2898AD) లో కమల్ హాసన్ 20 నిముషాలు మాత్రమే కనిపిస్తారట. రెండో భాగంలోనే కమల్ హాసన్ పూర్తి స్థాయిలో ఉంటారని సమాచారం. ఇక కల్కి సినిమాకు సంతోష్ నారాయ‌ణ్ అందించిన బీజీఎం ఈ ట్రైల‌ర్ కు ప్రాణం పోసింద‌ని చెప్పాలి. ఒక సైన్స్ ఫిక్ష‌న్ జోనర్ సినిమా అయినా.. విజువ‌ల్స్ తో అంద‌రినీ స్ట‌న్ చేశాడు ద‌ర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా ట్రైలర్ లో ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ బచ్చన్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్లు పడ్డాయని చెప్పాలి. ట్రైలర్ లో అమితాబ్ ని ఈ వయసులో కూడా నాగ్ అశ్విన్ వాడుకున్నంత బాగా ఎవరూ వాడుకోలేదని చెప్పాలి. ఇక కల్కి2898AD సినిమాలో క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ, పశుపతి, బ్రహ్మానందం త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాను జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయనుండగా, క‌ల్కి మూవీ థియేటర్లలో ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా పాన్ ఇండియా భాషలతో పాటు వరల్డ్ వైడ్ గా 22 భాషల్లో విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు