Kalki2898AD : అమితాబ్ అభిమానులకి ఐ ఫీస్ట్… ప్రభాస్ ని మించిన ఎలివేషన్లు..

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ప్ర‌భాస్ “క‌ల్కి 2898 AD” ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రియాంకా దత్, స్వప్న దత్ నిర్మించగా, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ విజువల్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటికిందే యూట్యూబ్ లో రిలీజ్ అయి అప్పుడే ట్రెండ్ అవుతుంది. ఇక అంచ‌నాల‌ను ఏమాత్రం త‌గ్గ‌కుండా హాలీవుడ్ రేంజ్ లో ట్రైల‌ర్ క‌ట్ ఉండ‌టంతో ప్రేక్ష‌కులు ప్ర‌భాస్ యుఫోరియాతో ఊగిపోతున్నారు.
అద్భుత‌మైన విజువ‌ల్స్ తో సాగే ఈ ట్రైల‌ర్ లో యాక్ష‌న్ కు కొదవ లేకుండా చూసుకున్నాడు నాగ్ అశ్విన్.

Kalki 2898AD trailer is an eye feast for Amitabh Bachchan fans

స్టన్నింగ్ విజువల్స్ తో సమఉజ్జీల సమరం..

ఇక ట్రైలర్ లో ఓ అమ్మాయి కోసం అశ్వధ్ధామ అండగా (అమితాబ్ బ‌చ్చ‌న్) చేసే పోరాటానికి, ఆ అమ్మాయిని తీసుకువస్తానని కాంట్రాక్టు మాట్లాడుకుని భైర‌వ (ప్ర‌భాస్) అడ్డుగా వెళ్తాడు. అటుపై ఏం జ‌రిగింద‌నేది మ‌న‌కు ఈ సినిమాలో చూపెట్ట‌నున్నారు. ఇక ఈ సినిమాలో అన్నిటికంటే బెస్ట్ గా నిలిచింది VFX సీన్స్. ప్రభాస్ తో సహా ఇందులో అందర్నీ ఓ రేంజ్ లో చూపించారు. ఇక ప్ర‌భాస్ యాక్ష‌న్ సీన్స్ ఈ ట్రైల‌ర్ కు మ‌రింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌ను ఎవ‌రూ ఊహించ‌ని గెట‌ప్ తో తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. సంతోష్ నారాయ‌ణ్ అందించిన బీజీఎం ఈ ట్రైల‌ర్ కు ప్రాణం పోసింద‌ని చెప్పాలి. ఒక సైన్స్ ఫిక్ష‌న్ జోనర్ సినిమా అయినా.. విజువ‌ల్స్ తో అంద‌రినీ స్ట‌న్ చేశాడు ద‌ర్శకుడు నాగ్ అశ్విన్. ఇక నాగ్ అశ్విన్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సునామీ సృష్టించ‌నున్నాడో ఈ ట్రైల‌ర్ క‌ట్ తో క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ లో ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ ఆశ్చర్యపరిచారని చెప్పాలి.

- Advertisement -

అమితాబ్ అభిమానులకి ఐ ఫీస్ట్…

కల్కి2898AD (Kalki2898AD) ట్రైలర్ లో ప్రభాస్ భైర‌వ పాత్ర‌ కంటే, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్లు పడ్డాయని చెప్పాలి. ట్రైలర్ లో ప్రభాస్ తోనే యుద్ధం చేసే అమితాబ్ స్టన్నింగ్ విజువల్స్ తో భారీ ఫైట్లు చేస్తున్నట్టు మేకర్స్ చూపించారు. బహుశా గత రెండు 20 ఏళ్లలో అమితాబ్ ఈ రేంజ్ పవర్ ఫుల్ రోల్ చేసింది లేదని చెప్పాలి. అమితాబ్ ని ఈ వయసులో కూడా నాగ్ అశ్విన్ వాడుకున్నంత బాగా ఎవరూ వాడుకోలేదని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ అభిమానులకు ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్ గా అనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. దీంతో బాలీవుడ్లో కూడా కల్కి2898AD రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ, పశుపతి, బ్రహ్మానందం త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాను జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయనుండగా, క‌ల్కి మూవీ ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు